విజయ్ దేవరకొండ మళ్ళీ గెలిచాడు

సినిమాల సక్సెస్ తో నిమిత్తం లేకుండా విజయ్ దేవరకొండ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకొన్నాడు వరుసగా రెండోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు . విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని మరోమారు రుజువు అయ్యింది. అమ్మాయిలు కూడా ఇంకా విజయ్ దేవరకొండని మరిచి పోలేదని మరోసారి రుజువైంది. 2017లో రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ 2018 లో తొలిసారిగా […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 2:19 pm
Follow us on

సినిమాల సక్సెస్ తో నిమిత్తం లేకుండా విజయ్ దేవరకొండ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకొన్నాడు వరుసగా రెండోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు .

విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని మరోమారు రుజువు అయ్యింది. అమ్మాయిలు కూడా ఇంకా విజయ్ దేవరకొండని మరిచి పోలేదని మరోసారి రుజువైంది. 2017లో రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ 2018 లో తొలిసారిగా ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు.

2018 లో విజేతగా నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను 2019 లో కూడా అగ్రస్థానంలోనే ఉంటానని విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం. అన్నట్లే 2019 హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో నంబర్ వన్ గా గెలిచి చూపించాడు

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. ఇక యువ కథానాయకుడు రామ్ (ఇస్మార్ట్ శంకర్ ), యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు మరియు నాలుగు స్థానాలు సాధించారు. ఆ తరవాతి స్థానాల్లో వరుణ్ తేజ్ (7), సుధీర్ బాబు (8), ప్రదీప్ మాచిరాజు (9) ఉన్నారు. అక్కినేని నాగచైతన్య 11వ స్థానంలో నిలవగా.. అల్లు అర్జున్ 12వ ర్యాంకు సాధించాడు. ఆశ్చర్యకరం గా జూనియర్ ఎన్టీఆర్ 19వ స్థానంలో ఉన్నాడు. విజయ్ దేవరకొండకు తానేం తక్కువ అన్నట్లు గా మాట్లాడే హిట్ హీరో విశ్వక్ సేన్ ఈ జాబితాలో 30వ స్థానంలో నిలవడం విశేషం .
Public opinion resembles craze