Vijay Devarakonda: 100 కోట్ల తో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ కొత్త మూవీ…ఆయన మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక జూదం లాంటిది. ఎప్పుడు ఎవరికి సక్సెస్ వస్తుంది. ఎవరికి ఫెయిల్యూర్ వస్తుందనేది ఎవరు చెప్పలేరు. అందువల్లే ఒకరోజు ఒక హీరో స్టార్ టాప్ పొజిషన్ లో ఉంటే మరొక రోజు మరొక హీరో స్టార్ స్టేటస్ ని అందుకోవచ్చు...

Written By: Gopi, Updated On : October 31, 2024 2:38 pm

Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే ఎవరికివారు సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో కూడా వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దర్శకులే కాకుండా హీరోలు కూడా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడంలో చాలా వరకు ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లాంటి నటుడు తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకి సైతం పోటీని ఇచ్చే విధంగా సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయనకు సరైన సక్సెస్ లు లేకపోవడంతో ఇప్పుడు ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయింది. ఇక అందులో భాగంగానే ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 100 కోట్లకు పైన బడ్జెట్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్స్ నాగ వంశీ సైతం ఎక్కడ వెనక్కి తగ్గకుండా భారీ రేంజ్ లో డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం నాగ వంశీ ఎందుకలా ఎక్కువ బడ్జెట్ ని పెడుతున్నాడు. ఈ సినిమా మీద ఆయనకు ఎందుకు అంతలా కాన్ఫిడెంట్ పెరిగిందనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. నిజానికైతే ఈ సినిమాని రామ్ చరణ్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ఈ కథను రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే గౌతమ్ తిన్ననూరి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకుంటాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియాలో స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు. కానీ 100 కోట్ల మార్క్ దాటాలంటే విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ సక్సెస్ కి కొట్టాల్సిన అవసరం అయితే ఉంది.

ప్రస్తుతం ఆయనకున్న మార్కెట్ ను బట్టి చూసినా కూడా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలంటే మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవాలి… ఇప్పటికే పాన్ ఇండియాలో ‘లైగర్ ‘ సినిమాతో భారీ దెబ్బ పడిన విజయ్ దేవరకొండకి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది.

ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ ఈ సినిమా మీద ఎందుకు ఇంత బడ్జెట్ ని పెడుతున్నాడు. ఆ బడ్జెట్ రికవరీ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత తర్వాత వెయిట్ చేయాల్సిందే…