Do Patti: డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ హవా సాగుతుండగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం సిరీస్లు చేస్తున్నారు. అలాగే నేరుగా తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ ని ఇష్టపడే ఆడియన్స్ సంఖ్య పెడుతుంది. ఇండియాలో ఈ బిజినెస్ వేల కోట్లకు చేరింది. ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. హాట్ స్టార్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో సినిమా మేజర్ ప్లేయర్స్ గా ఉన్నాయి. అత్యధిక సబ్స్క్రయిబర్స్ ని కలిగి ఉన్నాయి.
కాగా నెట్ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన ఓ చిత్రం సంచలనాలు చేస్తుంది. అదే దో పత్తి. కృతి సనన్, కాజోల్, షహీర్ షేక్ ప్రధాన పాత్రలు చేశారు. దో పత్ని చిత్రాన్ని అక్టోబర్ 25న నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మెల్లగా జోరందుకుంది. షారుఖ్ ఖాన్ డంకీ చిత్రాన్ని వెనక్కి నెట్టింది. వరల్డ్ వైడ్ నెట్ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడినది హిందీ చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. షారుఖ్ ఖాన్ డంకీ 5వ స్థానంలో ఉంది. దో పత్తి చిత్రం 5.3 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ టాప్ లో ఉంది. ఆ తర్వాత హ్రితిక్ రోషన్ ఫైటర్ ఉంది. ఇక మూడో స్థానంలో క్రూ చిత్రం ఉంది. ఈ చిత్రాలను దో పత్తి అధిగమించే సూచనలు కలవు. దో పత్తి నెట్ఫ్లిక్స్ లో విడుదలై వారం రోజులు మాత్రమే అవుతుంది.
దో పత్తి చిత్రంలో కృతి సనన్ డ్యూయల్ రోల్ చేసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. డా పత్తి చిత్రంతో కృతి సనన్ నిర్మాతగా కూడా మారింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కాగా కృతి సనన్ తెలుగులో వన్ నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.