Kushi OTT: సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక సినిమాతో విజయ్ దేవరకొండ అనే ఒక హీరో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అర్జున్ రెడ్డి ఇచ్చిన సక్సెస్ తో ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. ఇక గత ఏడాది ఆయన చేసిన లైగర్ సినిమా భారీ అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్ అయింది దాంతో అలాంటి ఒక భారీ డిజాస్టర్ తర్వాత చేసిన సినిమానే ఖుషి…ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటించింది. ఇక ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కింది.ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయినప్పటికీ ఈ సినిమా ప్రస్తుతం ఓటీడీలో కూడా సందడి చేయడానికి రెడీ అయింది.
ఒక ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అర్ధరాత్రి నుంచి అందుబాటు లో ఉంది. థియేటర్లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఓటిటిలో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాకి ముందు విజయ్ దేవరకొండ లైగర్ అనే ఒక పెద్ద ఫ్లాప్ తో ఉన్నాడు,అలాగే సమంత కూడా యశోద , శాకుంతలం లాంటి రెండు భారీ ప్లాపులతో ఉండడం అలాగే శివ నిర్మాణ కూడా టాక్ జగదీష్ లాంటి ఒక డిజాస్టర్ సినిమాతో ఉండడంవల్ల ఈ ఒక్క సినిమా వీళ్ల ముగ్గురి కెరీర్ కి మంచ్ బుస్టాప్ ఇచ్చిందనే చెప్పాలి ఈ సినిమా తోనే వీళ్ళు ముగ్గురు మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కారు.ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి అయితే ఈ సినిమా రామ్ చరణ్ చేయాలి, కానీ రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో గౌతమ్ తిన్ననూరి విజయ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా మీదనే విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఫైన పాన్ ఇండియా సినిమా గా రావడం విశేషం… ఇక సమంత విషయానికి వస్తే అనే ప్రస్తుతం కొన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలను కూడా వింటుంది… శివ నిర్మాణ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం ఒక స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…
శివ నిర్మాణ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ లవ్ స్టోరీస్ ని హ్యాండిల్ చేయడంలో ఆయనకి సపరేట్ స్టైల్ ఉంది. అందుకే వరుస లవ్ స్టోరీస్ తీసిన కూడా అన్ని మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ సినిమా కూడా లవ్ స్టోరీ నా లేదంట వేరే జానర్ కి సంబంధించిన సినిమానా అనేది తెలియాలి అంటే ఆయన చేసే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి..