Butterfly Effect: ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దానికి సంబంధించిన కారణాలు చాలా ఉంటాయి. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే ఆ సినిమాకి సంబంధించిన కారణాలు కూడా చాలానే ఉంటాయి. కానీ ఒక రెండున్నర గంటల పాటు నడిచే ఒక సినిమాని సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టాలి అంటే మాత్రం అది కచ్చితంగా డైరెక్టర్ చేతిలో పనే అని చెప్పాలి. ఆయన ఎంత బాగా స్టోరీని రాసుకొని తీయాగలిగితే ఆ సినిమా అంత బాగా ఆడుతుంది.
ప్రస్తుతం తెలుగులో ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత అంతటి మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ ఈయన తీసిన నాన్నకు ప్రేమతో అనే సినిమా చాలా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ లుక్స్ పరంగా ఇంతకుముందు సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు. ఈ సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా స్టోరీ మొత్తం బటర్ ఫ్లై ఎఫెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎక్కడో జరగాల్సిన ఒక సంఘటన కి ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఇంటర్ లింక్ అయి ఉంటాయి…
అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక సీన్ లో బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడో బటర్ ఫ్లై తన రెక్కల్ని ఆడిస్తే అక్కడ వేరే దేశంలో భూకంపం వస్తుందంటా అని ఒక సీన్ లో ఆ ఎఫెక్ట్ గురించి చెప్పడం జరిగింది. నిజానికి బటర్ ఫ్లై ఎఫెక్ట్ కి ఈ సినిమాని సుకుమార్ ఎలా కన్వర్ట్ చేశారు అంటే జగపతి బాబు రాజేంద్రప్రసాద్ ని మోసం చేయడం వల్ల ఆయన కొడుకు అయిన ఎన్టీయార్ చేతిలో జగపతిబాబు ఓడిపోవాల్సి వస్తుంది. ఇలా స్టోరీ ని బటర్ ఫ్లై ఎఫెక్ట్ తో ఇంటర్ లింక్ చేయడం జరిగింది.ఇక బటర్ ఫ్లై ఎఫెక్ట్ తో వచ్చిన మొదటి సినిమా నాన్నకు ప్రేమతో అని అనుకుంటారు కానీ నాన్నకు ప్రేమతో కంటే ముందే దశావతారం అనే ఒక సినిమా కూడా బటర్ ఫ్లై ఎఫెక్ట్ తోనే వచ్చింది.
సినిమా ఇంట్రాడక్షన్ లో డైరెక్టర్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమాలో ఆ బటర్ ఫ్లై ఎఫెక్ట్ ని ఎలా కన్ క్లూజ్ చేశారు అంటే మొదటగా సినిమాలో వచ్చే కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రంగరాజన్ ని విష్ణుమూర్తి విగ్రహానికి కట్టి సముద్రంలో పడేస్తారు. కట్ చేస్తే క్లైమాక్స్ లో సునామి వచ్చిన తర్వాత ఆ విగ్రహం అనేది మళ్లీ బయటికి రావడం జరుగుతుంది. అలా సముద్రంలో రంగరాజన్ ని వదిలేయడం వల్లే అప్పట్నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాల కారణం గానే ఇప్పుడు ఈ సునామి వచ్చింది అనేది డైరెక్టర్ సింబాలిక్ గా చెప్పడం జరిగింది…