https://oktelugu.com/

Vijay Devarakonda : ఖలేజా’ సినిమా బాగాలేదని అన్నందుకు ఆ యంగ్ హీరోని చితకబాదిన విజయ్ దేవరకొండ..!

ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు, ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు.. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఖలేజా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ 'త్రివిక్రమ్ గారి సినిమాల్లో నాకు జల్సా, అతడు, ఖలేజా సినిమాలంటే చాలా ఇష్టం.

Written By:
  • Vicky
  • , Updated On : October 28, 2024 / 08:30 PM IST

    Vijay Devarakonda

    Follow us on

    Vijay Devarakonda : డైరెక్టర్ త్రివిక్రమ్ కెరీర్ లో కమర్షియల్ గా భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే అందులో ‘ఖలేజా’ చిత్రం టాప్ లో ఉంటుంది. ‘అతడు’ వంటి భారీ హిట్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో, ఆ రోజుల్లో ఈ చిత్రంపై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండేవి. విడుదలకు ముందు ‘సదా శివ సన్యాసి’ అనే పాట అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపింది. అయితే సినిమా అప్పటి ఆడియన్స్ కి చాలా అడ్వాన్స్ గా ఉండడంతో కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ, కాలం గడిచే కొద్దీ రిపీట్ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేటి తరం ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.

    ఇంత మంచి సినిమాని అప్పట్లో ఫ్లాప్ ఎలా చేసారు అని సోషల్ మీడియా లో ఎన్నో సందర్భాలలో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. కేవలం అభిమానులకు మాత్రమే కాదు సెలెబ్రెటీలకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం. నిన్న రాత్రి హైదరాబాద్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు, ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు.. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఖలేజా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘త్రివిక్రమ్ గారి సినిమాల్లో నాకు జల్సా, అతడు, ఖలేజా సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఖలేజా , అతడు సినిమాలను ఎన్ని సార్లు చూసి ఉంటానో లెక్కే లేదు. ఎవరైనా నా దగ్గరకి వచ్చి ఖలేజా సినిమా బాగాలేదంటే నేను గొడవపడేవాడిని. కొట్లాటలు కూడా జరిగాయి. అంత ఇష్టం ఆ సినిమా అంటే. త్రివిక్రమ్ గారిని నేను చాలా సార్లు కలిసాను. ఆయన్ని కలిసినప్పుడల్లా మా మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు జరగవు. కేవలం వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుకునేవాళ్ళం. రామాయణం, మహాభారతం గురించి ఆయన చెప్పే విషయాలను గంటల తరబడి ఆసక్తిగా వినేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు.

    అదే విధంగా దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ ‘నేను సినిమాల్లోకి రాకముందే ఆయన పెద్ద స్టార్. అప్పట్లో ఓటీటీ ఉండేది కాదు కాబట్టి టొరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకొని ఆయన సినిమాలు చూసేవాడిని. ఒక తమిళ డైరెక్టర్ మా ఇద్దరి కాంబినేషన్ లో మల్టీస్టార్రర్ చిత్రం చేయాలనుకున్నాడు. అప్పుడు మేమిద్దరం ఒకరికి ఒకరు పరిచయం అయ్యాం. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇది ఇలా ఉండగా ఖలేజా గురించి విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలను మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.