Indra Movie : ఎవరికి ఏ సినిమా దక్కుతుందో చెప్పలేం. కొన్ని సార్లు బ్లాక్ బస్టర్ మూవీని వదులుకుని ప్లాప్ మూవీ చేయాల్సి రావచ్చు మరి కొన్నిసార్లు దానికి రివర్స్ కావచ్చు. అందుకే చిత్ర పరిశ్రమలో టాలెంట్ కంటే టైమింగ్, లక్ ముఖ్యం. అయినప్పటికీ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా ముఖ్యం. మొదట్లో సంచలనాలు చేసిన చాలా మంది హీరోలు కనుమరుగైపోవడానికి కారణం ఇదే. కథల ఎంపికలో తడబడి వరుస ప్లాప్స్ తో రేసులో వెనుకబడిపోతారు.
కాగా చిరంజీవి ముందు చూపు ఆయనకు ఓ బ్లాక్ బస్టర్ కట్టబెట్టిందట. అదేమిటో చూద్దాం. విషయంలోకి వెళితే.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బీ. గోపాల్, నిర్మాత అశ్వినీదత్ ఒక చిత్రం చేయాలని అనుకున్నారు. ఆ సినిమాకు హీరోగా చిరంజీవి డేట్స్ తీసుకున్నారు. మంచి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ కి కథ, స్క్రీన్ ప్లే అందించిన చిన్ని కృష్ణను సంప్రదించారట. ఆయనకు అవకాశం ఇచ్చారట. ఆరు నెలలు కష్టపడి చిన్ని కృష్ణ చిరంజీవి కోసం ఓ కథ రాశాడట.
బీ. గోపాల్, అశ్వినీదత్ లకు చిన్ని కృష్ణ ఆ కథను నెరేట్ చేశాడట. ఎందుకో వాళ్లకు ఆ కథ నచ్చలేదట. మాకు కథ అంతగా నచ్చలేదు అన్నారట. దానితో చిన్ని కృష్ణ నిరాశకు గురయ్యాడట. పరుచూరి బ్రదర్స్ చిన్ని కృష్ణకు ఓ సలహా ఇచ్చారట. చిరంజీవికి కూడా ఒకసారి వినిపించు. ఆయనకు నచ్చే అవకాశం కలదు అన్నారట. చిరంజీవికి చిన్ని కృష్ణ రెండు గంటల పాటు కథ వినిపించాడట. ఆయనకు బాగా నచ్చేసిందట. ఈ ప్రాజెక్ట్ చేద్దాం అన్నారట.
ఈ కథ బీ. గోపాల్, అశ్వినీదత్ లకు నచ్చలేదన్న విషయం తెలుసుకున్న చిరంజీవి వారిని కన్విన్స్ చేశాడట. ఈ మూవీ కాసులు కురిపిస్తుంది. భారీ హిట్ అవుతుంది. నన్ను నమ్మండి అన్నారట. చిరంజీవి మాట కాదనలేరు కాబట్టి… ప్రాజెక్ట్ పూర్తి చేసి విడుదల చేశారట. కట్ చేస్తే మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్. చిరంజీవి చెప్పినట్లే ఆ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. ఇంద్ర.
2002లో విడుదలైన ఇంద్ర అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. భారీ విజయాన్ని నమోదు చేసింది. చిరంజీవికి జంటగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే నటించారు. మణిశర్మ మ్యూజిక్ అద్భుతంగా కుదిరింది. చిరంజీవి చేసిన ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇంద్ర. అప్పటి వరకు చిరంజీవి పరాజయాల్లో ఉన్నారు. ఆ రేంజ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆ సమయంలో ఇంద్ర రూపంలో ఆయన సాలిడ్ హిట్ నమోదు చేశాడు.