Vijay Devarakonda And Rashmika: ఈ నెల 26న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) వివాహం ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్ష్యంలో జరగనుంది. ప్రస్తుతానికి ఈ విషయాన్నీ అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు, అది ఎందుకో తెలియcదు కానీ, వీళ్ళ ఇలా చేయడం పై అభిమానులు మాత్రం చాలా చిరాకు పడుతున్నారు. మొన్న ముంబై విమానాశ్రయం లో రష్మిక కనిపించినప్పుడు అక్కడి మీడియా రిపోర్టర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలపగా, మీరు దేనికోసం శుభాకాంక్షలు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదంటూ సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకపక్క వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖ సోషల్ మీడియా లో లీకై చక్కర్లు కొడుతుంటే, ఎందుకు రష్మిక ఇలా మాట్లాడుతుంది?, అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా వీళ్లేందుకు ఇంతలా నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అది కాసేపు పక్కన పెడితే నిన్న ఈ జంట ముంబై లో కలిసి ఒకే కారులో ప్రయాణం చేయడం, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మొన్ననే మాకు ఏమి తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసిన రష్మిక, ఇప్పుడు ఇలా విజయ్ దేవరకొండ తో కనిపించడం చూసి, ఈమె సినిమాల్లో కంటే బయటే బాగా నటిస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు. కనీసం పెళ్లి జరిగిన తర్వాత అభిమానుల కోసం పెళ్లి ఫోటోలు అయినా సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తారా?, లేదంటే అది కూడా రహస్యంగానే కానిచేస్తారా అని అడుగుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను మీరు కూడా క్రింద చూసేయండి.
ఇకపోతే వీళ్లిద్దరి సినీ కెరీర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన కం బ్యాక్ ఎప్పుడు ఇస్తాడో కూడా అర్థం అవ్వని పరిస్థితి. ప్రస్తుతం ఆయన ‘రౌడీ జనార్ధన’, ‘రణ బలి’ చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్లు విడుదల అయ్యాయి . వీటికి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందనే వచ్చింది. విజయ్ దేవరకొండ తనకు సూట్ అవ్వని పాత్రలు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక రష్మిక విషయానికి వస్తే రీసెంట్ గానే ఆమె ‘గర్ల్ ఫ్రెండ్’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. అంతకు ముందు ఆమె పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతానికి వీళ్ళ కెరీర్లు ఇలా ఉన్నాయి. పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి.
#RashmikaMandanna and #VijayDeverakonda arrived at the airport together. #FilmfareLens pic.twitter.com/elQvBvf8Nd
— Filmfare (@filmfare) February 16, 2026