HomeNewsVijay Devarakonda And Rashmika: డార్లింగ్ పార్టీ కావాలి... రష్మిక కోరితే విజయ్ దేవరకొండ ఏమన్నాడో...

Vijay Devarakonda And Rashmika: డార్లింగ్ పార్టీ కావాలి… రష్మిక కోరితే విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా?

Vijay Devarakonda And Rashmika: విజయ్ దేవరకొండను రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందాన పార్టీ అడిగింది. ఆమె కోరికకు విజయ్ దేవరకొండ స్పందించాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండగా విజయ్ దేవరకొండ అండ్ టీమ్ ప్రమోషన్స్ షురూ చేశారు. మార్చి 28న ట్రైలర్ విడుదల చేశారు. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎమోషన్, లవ్, యాక్షన్, కామెడీ కలగలిపి పక్కా యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని అర్థం అవుతుంది.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసిన రష్మిక మందాన చాలా ఎగ్జైట్ అయ్యింది. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘డార్లింగ్ విజయ్ దేవరకొండ, పరశురామ్ లకు బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుంది. నాకు పార్టీ కావాలి… అని ఎక్స్ లో ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు. రష్మిక మందాన ట్వీట్ ట్యాగ్ చేస్తూ.. ‘క్యూటెస్ట్’ అని కామెంట్ పెట్టాడు.

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన సోషల్ మీడియా సంభాషణ వైరల్ గా మారింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్. భారీ లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాలతో జాబితాలో చేరింది. గీత గోవిందం రష్మిక మందాన ఫేట్ మార్చేసింది. ఆమెకు స్టార్డం తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండకు కూడా గీత గోవిందం విపరీతమైన ఫాలోయింగ్ రావడానికి కారణం అయ్యింది. పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో ఫ్యామిలీ స్టార్ రెండో చిత్రంగా వస్తుంది.

ఇక గీత గోవిందం మూవీ సెట్స్ లోనే విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమలో పడ్డారనే వాదన ఉంది. అనంతరం వీరికి కాంబోలో డియర్ కామ్రేడ్ మూవీ వచ్చింది. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముద్దు సన్నివేశాలలో మాత్రం రెచ్చిపోయారు. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని కన్ఫర్మ్ చేశాడు. రష్మికను ప్రేమిస్తున్న విజయ్ దేవరకొండ ఆమెనే పెళ్లి చేసుకుంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

RELATED ARTICLES

Most Popular