Vijay Devarakonda And Rashmika: సినిమా ఇండస్ట్రీలో నటినటుల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి. కొంతమంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించి వాళ్ళు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాగార్జున అమల, మహేష్ బాబు నమ్రత , సూర్య జ్యోతిక లాంటి నటీనటులు మొదట ఆన్ స్క్రీన్ మీద మెప్పించి ఆ తర్వాత నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు సైతం చేరిపోతున్నారు. శుక్రవారం రోజున విజయ్ దేవరకొండ ఇంట్లోనే నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరిలో వీళ్ళ పెళ్లి ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో చాలాసార్లు వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికి వాళ్ళు కొట్టిపారేశారు.
మొత్తానికైతే ఇప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకొని అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి గీతా గోవింద సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా సమయంలో వీరిద్దరు పెద్దగా మాట్లాడుకునే వారు కాదట… సినిమా దర్శకుడు అయిన పరుశురాం వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కుదరడానికి కొన్ని డైలాగులను వీళ్ళ చేత ప్రాక్టీస్ చేయించేవారట…
అలా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత్యం కుదిరిందని ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకున్నారని గీతగోవిందం సినిమా దర్శకుడు వల్లే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమసీ క్రియేట్ అయిందని తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందాన ఫ్యాన్స్ అందరు వీళ్ళిద్దరిని కలిపినందుకు పరుశురాంకి థాంక్స్ చెబుతున్నారు…
ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని అన్యోన్యంగా కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు విష్ చేస్తున్నారు… ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మరొక సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… ఇక రష్మిక సైతం ప్రస్తుతం మైసా సినిమా చేస్తోంది. ఇక ఈమె ఇప్పటికే ఈ సంవత్సరం ‘కుబేర’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించింది…