Liger Collections: లైగర్ ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర కనీస వసూళ్లను కూడా రాబట్టలేక ఎదురీదుతోంది. మొత్తానికి బయ్యర్లను అడ్డంగా ముంచింది. కొన్ని ఏరియాల్లో అయితే, థియేటర్ రెంట్ డబ్బులు కూడా వెనక్కి రాలేదు. భారతీయ సినీ చరిత్రలోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా, ఈ లైగర్ చిత్రం చరిత్ర పుటల్లోకి సగర్వంగా ఎక్కింది. నేటికీ హిందీలో సరైన సినిమా లేకపోయినప్పటికీ.. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పూర్తిగా చేతులు ఎత్తేసింది. మరి ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండ

ముందుగా ఈ సినిమా 12 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 5.77 కోట్లు
సీడెడ్ 1.88 కోట్లు
ఉత్తరాంధ్ర 1.80 కోట్లు
ఈస్ట్ 0.90 కోట్లు
వెస్ట్ 0.59 కోట్లు
గుంటూరు 0.99 కోట్లు
కృష్ణా 0.74 కోట్లు
నెల్లూరు 0.57 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 12 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 13.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 26.42 కోట్లు వచ్చాయి.
తమిళనాడు 0.36 కోట్లు
కేరళ 0.32 కోట్లు
కర్ణాటక 1.01 కోట్లు
హిందీ 8.27 కోట్లు
ఓవర్సీస్ 3.44 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 12 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 26.63 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 55:26 కోట్లను కొల్లగొట్టింది

లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, 12 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే.. ఈ సినిమాకి 33 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు.