Ram Charan Turned Into A Salesman: రామ్ చరణ్ సేల్స్ మ్యాన్ గా మారిపోయాడు. అదేమిటి ? చరణ్ సేల్స్ మ్యాన్ ఏమిటి అనుకుంటున్నారా ?, మీషో కోసం రామ్ చరణ్ సేల్స్ మ్యాన్ గా మారిపోయాడు. ‘రండి రండి బట్టలు కొనండి’ అంటూ రామ్ చరణ్ తన స్టైల్లో డైలాగ్స్ చెప్పడం ఈ యాడ్ లో హైలైట్ గా నిలిచింది .ప్రస్తుతం ఈ యాడ్ వైరల్ అవుతోంది. ఆ మధ్య అలియా భట్‌తో కలిసి రామ్ చరణ్ ఫ్రూటీకి అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మికతో కలిసి మీషో యాడ్‌లో రామ్ చరణ్ నటించాడు.

అయితే, ఈ మీషో యాడ్ లో గంగూలీ కూడా కనిపించడం విశేషం. మొత్తానికి చరణ్ ప్రస్తుతం యాడ్స్ షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ యాడ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. తాను చేసే యాడ్ తన అభిమానుల పై బాగా ప్రభావం చూపిస్తోందని.. అందుకే, సరైన యాడ్స్ మాత్రమే తాను చేస్తాను అని చెర్రీ ఎప్పుడు చెబుతూ ఉంటాడు.

అందుకే ఆ మధ్య చెర్రీ ఓ భారీ డీల్ కు నో చెప్పాడు. ప్రముఖ కంపెనీ పొగాకు ఉత్పత్తి అయిన ఇలాచీ పౌడర్ ను సపోర్ట్ చేయాలని రామ్ చరణ్ ను సంప్రదించింది సదరు కంపెనీ. పైగా ఈ సంస్థ చరణ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసింది. అయితే ఈ యాడ్ ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టిస్తుందని భావించిన చరణ్ ఈ యాడ్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు.
చరణ్ ఇలాంటి యాడ్స్ కు దూరంగా ఉండటం తమకు గర్వకారణం అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తెలపడం గమనార్హం. ఈ విషయంలో నెటిజన్లు సైతం చరణ్ ను తెగ మెచ్చుకుంటున్నారు. చరణ్ ప్రస్తుతం విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నిటికి మించి ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్, ది విచ్చేర్, ది హాబిట్ సినిమాలకు వర్క్ చేసిన మేకప్ టీమ్ వేటా వర్క్ షాప్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. చరణ్ ను చాలా కొత్తగా చూపించడానికి వీళ్లు లేటెస్ట్ పరికరాలను కూడా ఉపయోగించారు. రామ్ చరణ్ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని శంకర్ ఆశ పడుతున్నాడు. ఎలాగూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. కాబట్టి.. ఈ సినిమాతో తన ఆశను తీర్చుకుంటాడేమో చూడాలి.
They stole your hearts. Now bringing steal deals on your mobile screens are the mega stars @AlwaysRamCharan, @iamRashmika, @ImRo45 and @SGanguly99 in #Meesho #MegaBlockbusterSale from 23rd Sep to 27th Sep. We can’t keep calm, can you? pic.twitter.com/hjjBWhX9Yi
— Meesho (@Meesho_Official) September 5, 2022
[…] Also Read: Ram Charan Turned Into A Salesman: వైరల్ : సేల్స్ మ్యాన్ గ… […]