Homeఎంటర్టైన్మెంట్Parampara: జగపతిబాబు "పరంపర" వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసిన... రామ్ చరణ్

Parampara: జగపతిబాబు “పరంపర” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసిన… రామ్ చరణ్

Parampara: ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో జగపతిబాబు. విభిన్న పాత్రల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న జ‌గ‌ప‌తి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా వెబ్ సిరీస్ ల బాట ప‌ట్టారు ఈ హీరో. ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్, నవీన్ చంద్ర లతోన్ కలిసి జ‌గ‌ప‌తి బాబు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్ర‌సారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు “పరంప‌ర” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Parampara
Parampara

Also Read: రాయలసీమకు జరుగుతున్న ఆన్యాయమే బాలయ్య కథ !

తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ‘నన్నడిగితే చావడం కన్నా చంపడం కష్టం.’ అనే నవీన్ చంద్ర మాటలతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘నాయుడు కింగ్ మేకర్.. అంటే కింగ్ కన్నా గొప్పవాడు’ లాంటి డైలాగ్‌తో శరత్‌కుమార్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో చెప్పేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్‌లో ఆకాంక్ష సింగ్, రోగ్ ఫేం ఇషాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. నగేష్ కుమరన్ ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. అయితే ఇద్ద‌రు ప్రముఖ న‌టులు ముఖ్య పాత్ర‌ల‌లో చేస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.

Parampara Official Trailer | Jagapathi Babu, Sarath Kumar, Naveen Chandra | Telugu Original

Also Read: పుష్ప ఫెస్టివల్​కు అంతా సిద్ధం.. భారీ సంఖ్యలో థియేటర్లు లాక్​

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version