Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఏంటి ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ…ఆయన ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి గా మూడు సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇక ఆయన చేస్తున్న సినిమా లైనప్ ను చూసి ప్రేక్షకులందరు ఆశ్చర్యపడుతున్నారు. ఇక రాజావారు రాణి గారు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా, జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాగే తనతో టాక్సీవాలా అనే సినిమా చేసి తనకి మంచి విజయాన్ని అందించిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో మరొకసారి పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కడమే కాకుండా సరికొత్త కథతో రూపుదిద్దుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక తనతో పాటు రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్న రష్మిక మందాన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.
ఒక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేదు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ముఖ్యంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన ‘ లైగర్ ‘ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడమే కాకుండా ఆయన కెరియర్ అనేది భారీగా డౌన్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో రాహుల్ సంకృత్యాన్ కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక మంచి స్టార్ డమ్ అనేది క్రియేట్ అవుతుందనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.