Chiranjeevi in Tollywood: ఏపీలో ప్రభుత్వానికి, సినీ రంగానికి వార్ రోజురోజుకు పెరుగుతోంది. సినిమా టిక్కెట్ల ధర విషయంలో ప్రభుత్వం దిగిరాకపోవడంతో పాటు సినీ రంగంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై తనదైన శైలిలో సెటైర్ వేశారు. ‘చిరంజీవి సీఎం జగన్ ను అపాయింట్ మెంట్ అడిగారో లేరో నాకు తెలియదు’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
అయితే గతంలో చిరంజీవికి మంత్రి నాని ఫోన్ చేసి మరీ జగన్ అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో టాలీవుడ్ బృందంతో చర్చలకు రావాలని చిరును ఆహ్వానించారు. కాన ఆ తరువాత ఆ మీట్ జరగలేదు. కానీ ఇప్పుడు నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ పెద్దల్లో ఒకరైన చిరంజీనివి అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
Also Read: కళాకారుల ప్రతీకారం అధికారానికే ముప్పు.. జగన్ ఆలోచించు !
ఇప్పటికే సినీ రంగానికి చెందిన నటులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా వారి వ్యాఖ్యలపై మంత్రి నాని స్పందించారు. ‘హీరో నాని ఏ ఊర్లో ఉన్నాడో.. ఆయన ఏ కిరాణ కొట్టు లెక్కలు చెప్పాడో తెలియదు’ అని సెటైర్ వేశారు. అలాగే ‘సిద్ధార్థ ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు.. ఆయనమైనా ఇక్కడ ట్యాక్స్ లు కట్టారా..?’ అని అన్నారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
అయితే సినిమా టిక్కెట్ల వివాదంపై హైకోర్టు కమిటీ వేయాలని సూచించింది. దీంతో హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యేక కమిటీ ద్వారా ధరలు నిర్ణయిస్తామన్నారు. డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కానీ సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడడంపై కొందరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఓ ఇండస్ట్రీకి గౌరవం ఇద్దామనే ఆలోనలో లేదని అంటున్నారు.
కాగా గతంలో చిరంజీవితో కలిసి సినిమా సమస్యను పరిష్కరిద్దామని చెప్పుకొచ్చిన మంత్రి నాని ఇప్పుడు ఆయనపై కూడా సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏపీ ప్రభుత్వం సినిమా రంగాన్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదని కొందరు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయతే దిల్ రాజు తదితర నిర్మాతలు మాత్రం సానుకూలంగా సమస్యను పరిష్కరించుకుందామని, ఎవరూ అనవసర కామెంట్లు చేయొద్దని కోరారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ‘పే పర్ వ్యూ’లో.. వర్కౌట్ అవుతుందా ?