Vijay Antony Health: ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కి ‘బిచ్చగాడు’ పార్ట్ 2 షూటింగ్ లో ఉన్న సమయం లో ఒక సన్నివేశం తెరకెక్కిస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలపాలు అయినా సంగతి అందరికీ తెలిసిందే..మలేషియా లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బోట్ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయం లో ఎదురుగా వస్తున్న మరో బోట్ ఢీకొట్టడం వల్ల విజయ్ ఆంటోనీ బోట్ నుండి ఎగిరి క్రిందపడ్డాడు..అందువల్ల ఆయన తీవ్రమైన గాయాలపాలైయ్యాడు.

వెంటనే అతనిని సమీపం లో ఉన్న హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు..డాక్టర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విజయ్ ఆంటోనీ కి దవడ ఎముక మరియు పళ్ళు విరిగిపోయాయి..ముఖానికి కూడా బాగా దెబ్బలు తగిలాయి..చికిత్స అందిస్తున్నాము..ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పడం తో అభిమానులు రిలాక్స్ అయ్యారు..తమ అభిమాన హీరో త్వరగా కోలుకొని సురక్షితంగా బయటకి రావాలని ప్రార్థించారు.
అంత సజావుగా సాగిపోతుంది అనుకుంటున్న సమయం లో విజయ్ ఆంటోనీ కి ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ బులిటెన్ అభిమానులను ఆందోళనకు గురయ్యేలా చేస్తుంది..విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉందని..ఆయన భార్య మీడియా ముందు చెప్పుకొచ్చింది..ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడని..డాక్టర్లు అన్నీ విధాలుగా ప్రయత్నిస్తారని, ఆయన త్వరగా కోలుకుంటాడనే నమ్మకం ఉందంటూ ఫాతిమా ఈ సందర్భంగా తెలిపింది..విజయ్ ఆంటోనీ కి తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది..ఆయన హీరో గా నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం ఇక్కడ సంచలన విజయం సాధించింది..అప్పటి నుండి ఆయన తాను నటించిన ప్రతీ సినిమాని తెలుగు లో దబ్ చేస్తూ వచ్చాడు.

ఫలితం తో సంబంధం లేకుండా విభిన్నమైన అభిరుచి గల నటుడు అనే పేరు విజయ్ ఆంటోనీ సంపాదించుకున్నాడు..తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమాకి సీక్వెల్ ని గత ఏడాది నుండి తీస్తున్నాడు..కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సమయం లో ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం విచారకరం..ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.