Vijay Antony : తెలుగులో గుర్తింపు ఉన్న తమిళ హీరోల్లో విజయ్ ఆంటోని కూడా ఒకరు. ఆయన చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో నటించిన బిచ్చగాడు ఒక సంచలనం. కోటీశ్వరుడు తల్లి ప్రాణాల కోసం బిచ్చగాడిగా మారడం అనే కాన్సెప్ట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎమోషన్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాలు కలగలిపి తెరకెక్కించిన బిచ్చగాడు మూవీ కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది బిచ్చగాడు 2 వచ్చింది. ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది.
తాజాగా విజయ్ ఆంటోని హిట్లర్ టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. ఈ మూవీకి మణిరత్నం సహాయకుడు ధన దర్శకత్వం వహించాడు. చరణ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక రోల్స్ చేశారు. రియా సుమన్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 27న హిట్లర్ థియేటర్స్ లో విడుదలైంది. నాలుగు వారాల అనంతరం ఓటీటీలో వచ్చింది. అమెజాన్ ప్రైమ్ హిట్లర్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అక్కడ హిట్లర్ మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చు.
హిట్లర్ మూవీ కథ విషయానికి వస్తే… సెల్వ(విజయ్ ఆంటోని)కు ఒక బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు చెన్నై వస్తాడు. ఫ్రెండ్ రూమ్ లో ఉండాలని అనుకుంటాడు. స్నేహితుడు మాత్రం సెల్వ ఎవరో నాకు తెలియదు అంటాడు. అనుకోకుండా సెల్వకు సారా(రమ్య సుమన్)పరిచయం అవుతుంది. మరోవైపు నగరంలో వరుసగా రౌడీ షీటర్స్ హత్యకు గురవుతూ ఉంటారు. ఈ కేసును డిప్యూటీ కమిషనర్ శక్తి(గౌతమ్ మీనన్ వాసుదేవ్) ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు.
ఆ విచారణలో భాగంగా ప్రముఖ పొలిటీషియన్ రాజవేలు( చరణ్ రాజ్) కి చెందిన రూ. 500 కోట్లు ఎవరో కొట్టేశారని తెలుస్తుంది. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? రాజవేలు డబ్బులు ఎవరు కొట్టేశారు? ఈ హత్యలతో సెల్వకు ఏమైనా సంబంధం ఉందా? అనేది మిగతా కథ. హిట్లర్ మూవీలో అలరించే అనేక ట్విస్ట్స్ ఉన్నాయి.