Unstoppable with NBK S4 : బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, యంగ్ స్టార్స్ ఈ టాక్ షోకి హాజరయ్యారు. ఫస్ట్ టైం విక్టరీ వెంకటేష్ హోస్ట్ బాలయ్యతో ముచ్చటించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
బాలకృష్ణలోని కొత్త యాంగిల్ పరిచయమైంది అన్ స్టాపబుల్ షోతో. హోస్ట్ గా ఆయన ట్రెండ్ సెట్ చేశారు. అన్ స్టాపబుల్ టాక్ షో నయా రికార్డ్స్ నమోదు చేసింది. భారీ ఆదరణ దక్కించుకుంది. రెగ్యులర్, డిప్లమాటిక్ క్వశ్చన్స్, ఆన్సర్స్ కాకుండా క్రేజీ ప్రశ్నలు, కాంట్రవర్సీలు తెరపైకి తేవడం హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటికి మూడు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, సూర్య, దుల్కర్ సల్మాన్, శ్రీలీల, నవీన్ పోలిశెట్టితో పాటు అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ఈ టాక్ షోలో పాల్గొన్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరవుతున్నారు. అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి వెంకటేష్ వస్తున్నాడన్న సమాచారం ఇప్పటికే ఉంది. కాగా నేడు అధికారికంగా ప్రోమో విడుదల చేశారు. ఇక బాలయ్యతో కలిసి వెంకీ తొడ కొట్టాడు. వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్2 లోని వెంకీ ఆసనం బాలయ్య చేసి చూపడం విశేషం. ప్రోమో ఆసక్తి రేపుతోంది. సమకాలీన నటులుగా వెంకటేష్, బాలకృష్ణ ఉన్నారు. దశాబ్దాలుగా ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. వెంకటేష్ తండ్రి డి. రామానాయుడు సీనియర్ ఎన్టీఆర్ తో చిత్రాలు చేశారు. అనంతరం బాలయ్యతో కథానాయకుడు అనే చిత్రం నిర్మించారు.
అలాగే రామానాయుడు టీడీపీ పార్టీలో చేరి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు. బాలయ్య-వెంకీ కుటుంబాల మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఇక ఈ షో వేదికగా వెంకటేష్ తన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ని ప్రమోట్ చేయనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కిస్తున్నారు.
జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదల కానుంది. మీనాక్షి చౌదరి, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి-వెంకీలది హిట్ కాంబో. ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సైతం సంక్రాంతి బరిలో ఉంది. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్.. 2025 సంక్రాంతి బరిలో ఉన్నారు.