https://oktelugu.com/

Allu Arjun Arrest : దాడిపై స్పందించిన అల్లు అరవింద్..నా బిడ్డ జోలికి వచ్చిన వాళ్ళని వదలను అంటూ వార్నింగ్!

కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటిపై తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు రాళ్లు విసిరి, అతని ఇంటి ముందు దిష్టిబొమ్మ ని దగ్ధం చేసి, గోడ దూకి ఇంటి లోపలకు దూసుకొని వెళ్లే ప్రయత్నం చేయగా, అడ్డొచ్చిన అల్లు అర్జున్ సెక్యూరిటీ ని చితకబాది, అల్లు అర్జున్ ఇంటి పెరట్లో ఉన్నటువంటి పూల కుండీలను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 08:41 PM IST
    Follow us on

    Allu Aravind : కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటిపై తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన జేఏసీ నాయకులు రాళ్లు విసిరి, అతని ఇంటి ముందు దిష్టిబొమ్మ ని దగ్ధం చేసి, గోడ దూకి ఇంటి లోపలకు దూసుకొని వెళ్లే ప్రయత్నం చేయగా, అడ్డొచ్చిన అల్లు అర్జున్ సెక్యూరిటీ ని చితకబాది, అల్లు అర్జున్ ఇంటి పెరట్లో ఉన్నటువంటి పూల కుండీలను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో చనిపోయిన రేవతి కి తక్షణమే కోటి రూపాయిల ఆర్ధిక సహాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేడు. ఆ సమయం లో ఇంట్లో అతని పిల్లలు ఉన్నారు. ఇలా దాడి చెయ్యడానికి వచ్చిన వాళ్ళను చూసి పిల్లలు చాలా భయపడిపోయారు. దీంతో వాళ్ళను అల్లు అర్జున్ మామయ్య ఇంటికి వచ్చి పిల్లలిద్దరినీ సురక్షితంగా తన కారులో ఇంటికి తీసుకెళ్లిపోయారు.

    ఈ ఘటన జరిగిన తర్వాత మీడియా మొత్తం అల్లు అర్జున్ ఇంటి ముందుకు రాగా, అతని తండ్రి అల్లు అరవింద్ మీడియా తో కాసేపటి క్రితమే మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘జరిగిన సంఘటన గురించి మా పరిధిమేర మాత్రమే మాట్లాడగలం. ఇంటి మీదకు దాడి చేయడానికి వచ్చిన వాళ్ళను పోలీసులు పట్టుకొని వెళ్లారు. వాళ్ళ మీద కేసులు నమోదు అయ్యాయి, వాళ్ళని వదిలిపెట్టరు. ఈ అంశం గురించి ఇంతకు మించి మాట్లాడలేను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరో పక్క అల్లు అర్జున్ పై జరిగిన దాడికి ఆయన అభిమానులు నిరసన తెలుపుతూ సోషల్ మీడియా లో నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తున్నారు. రాజకీయాల కోసం మా అల్లు అర్జున్ ని వాడుకోవద్దు అంటూ లక్షల కొద్దీ ట్వీట్స్ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ అంశంపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. అయితే దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసినట్టుగా ఫోటోలు ఉన్నాయి. దీంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనీ, రేవంత్ రెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేయించాడని అల్లు అర్జున్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఇంటెర్మ్ బెయిల్ జనవరి 12 తో ముగుస్తుంది. ఆ తర్వాత అతనికి రెగ్యులర్ బెయిల్ రావడం దాదాపుగా అసాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పోలీసులు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించి పెడుతున్నారని తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ACP సీసీటీవీ వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ని స్వయంగా పోలీసులు లోపాలకి వెళ్లి తీసుకొస్తే కానీ ఆయన బయటకి రాలేదు. ఇలా చాలా ఆధారాలు బయటపడ్డాయి. వీటిని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.