Bichagadu 2 Movie Review: బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

విజయ్ గురుమూర్తి ( విజయ్ ఆంటోనీ) మరియు సత్య (విజయ్ ఆంటోనీ) ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు మనుషులు. విజయ్ గురుమూర్తి వేల కోట్ల రూపాయలకు అధిపతి కాగా, సత్య బిచ్చమ్ ఎత్తుకునే ఒక బిచ్చగాడు.రోడ్ల పక్కన , ఫుట్ పాత్ పక్కన ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ

Written By: Vicky, Updated On : May 19, 2023 12:22 pm

Bichagadu 2 Movie Review

Follow us on

Bichagadu 2 Movie Review: నటీనటులు : విజయ్ ఆంటోనీ , కావ్య థాపర్
దర్శకత్వం : ప్రియా కృష్ణ స్వామి
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ

2016 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన చిన్న చిత్రం ‘బిచ్చగాడు’. అప్పట్లో ఈ సినిమా పెద్ద హీరోల సినిమాలను సైతం డామినేట్ చేసేసింది. విజయ్ ఆంటోనీ కి అటు తమిళం లో ఇటు తెలుగు లో పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ చిత్రం.ఇప్పటికీ ఈ సినిమాకి TRP రేటింగ్స్ అదిరిపోయే రేంజ్ లో వస్తుంటాయి.తెలుగు ఆడియన్స్ కి అంత ఇష్టం ఈ సినిమా అంటే. అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ నేడు తెలుగు మరియు తమిళ్ బాషలలో ఘనంగా విడుదలైంది. బిచ్చగాడు సినిమాలాగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుండా?, సమ్మర్ లో తక్కువ సక్సెస్ రేట్ ఉండగా, ఈ సినిమా ద్వారా మళ్ళీ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది ఈ రివ్యూ లో తెలుసుకుందాము.

కథ :

విజయ్ గురుమూర్తి ( విజయ్ ఆంటోనీ) మరియు సత్య (విజయ్ ఆంటోనీ) ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు మనుషులు. విజయ్ గురుమూర్తి వేల కోట్ల రూపాయలకు అధిపతి కాగా, సత్య బిచ్చమ్ ఎత్తుకునే ఒక బిచ్చగాడు.రోడ్ల పక్కన , ఫుట్ పాత్ పక్కన ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ, దొరికింది తిని బ్రతుకుతుంటాడు. మరో పక్క విజయ్ గురుమూర్తి మానవ మెదడు మార్పిడి ప్రయోగం చేస్తూ ఉంటాడు.ఆ ప్రయోగం మీద భారీ ఎత్తున పెట్టుబడి పెడుతాడు. కొన్ని అనుకోని పరిణామాల కారణంగా ప్రయోగం లో భాగం సత్య మెదడు విజయ్ గురుమూర్తి కి ట్రాన్స్ ఫర్ చెప్పబడుతుంది. సత్య కి ఫ్లాష్ బ్యాక్ లో తన చెల్లెలు తప్పిపోయి ఉంటుంది, తనకి వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని తన చెల్లెలు ని కనిపెడుతాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఈ స్టోరీ వినగానే మనకి ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ గుర్తుకు వస్తుంది. అందులో కూడా స్టోరీ లైన్ ఇదే విధంగా ఉంటుంది.కానీ ఇక్కడ డైరెక్టర్ ప్రియా కృష్ణ స్వామి కాస్త కొత్తగా తీసే ప్రయత్నం చేసింది.ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేటట్టు తీశారు. మొదటి 20 నిముషాలు సినిమాటిక్ లిబర్టీ కి తగ్గట్టుగా తీశారు, దానికి కనెక్ట్ అయితే ఫస్ట్ హాఫ్ అందరికీ నచ్చుతుంది. బ్రెయిన్ టాన్స్ ప్లాంట్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.ఇక సెకండ్ హాఫ్ కథ కాస్త ట్రాక్ తప్పింది. కథ కంటే ఎక్కువగా హీరో ఎలివేషన్స్ కి ప్రాధాన్యత చూపించారు. అందువల్ల ఫస్ట్ హాఫ్ కి కనెక్ట్ అయ్యేటట్టు సెకండ్ హాఫ్ కి ఆడియన్స్ కన్నీటి అవ్వలేకపోయారు.ఇలా ఆస్తులన్నీ అమ్మేసి పేదవాళ్లకు సహాయం చెయ్యడం లాంటి కాన్సెప్ట్స్ చాలా సినిమాల్లో చూసాము.

ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ ఇంతకు ముందు లాగానే ఈ సినిమాలో కూడా సింగల్ ఎక్సప్రెషన్ తో లాగించేసాడు. ఆడియన్స్ కాస్త చిరాకు కలుగుతుంది, ఇక హీరోయిన్ కావ్య థాపర్ పర్వాలేదు అనిపించింది. బిచ్చగాడు సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం హైప్ కోసం మాత్రమే ఆ సినిమా టైటిల్ ని ఉపయోగించుకున్నారు.డైరెక్టర్ ప్రియా కృష్ణ స్వామి సెకండ్ హాఫ్ లో కథ ని నమ్ముకొని ముందుకు వెళ్లి వుంటే ఈ చిత్రం ‘బిచ్చగాడు’ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ ఎక్కువగా ఆమె హీరో కి ఎలివేషాన్స్ ఇవ్వడానికే ద్రుష్టి సారించింది.అందువల్లే ఈ చిత్రం కొంతమంది ఆడియన్స్ కి మాత్రమే నచ్చే సినిమాగా మారిపోయింది.

చివరి మాట : భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సంతృప్తి చెందుతారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ రొటీన్ కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ ని ఇష్టపడే వాళ్ళు నచ్చే అవకాశం ఉంది.

రేటింగ్ : 2.5/5