Homeఎంటర్టైన్మెంట్కోట్లు కొల్లగొట్టడానికి మళ్ళీ వస్తున్నాడు !

కోట్లు కొల్లగొట్టడానికి మళ్ళీ వస్తున్నాడు !

Bichagadu 2మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్‌ ఆంటోనీ హీరోగా ‘బిచ్చగాడు’ సినిమా ఎంత గొప్పగా సూపర్‌ హిట్‌ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఆ సినిమా చాలా బాగా నచ్చింది. భారీ కలెక్షన్స్ ను రాబట్టింది ఆ సినిమా. బిచ్చగాడు కాస్త చివరకు కోట్లు కొల్లగొట్టాడు. మొత్తమ్మీద తెలుగు నాట ఆ సినిమా రికార్డులను కూడా సృష్టించింది.

అసలు ఒక డబ్బింగ్ సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు, పైగా సినిమాలో హీరో ఎవరో కూడా అప్పటికి చాలమందికి తెలియదు. అయినా రికార్డులు సృష్టించే రేంజ్ లో బిచ్చగాడు తెలుగు బాక్సాఫీస్ దగ్గర భారీగా రెచ్చిపోయాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా స్థాయిలో హిట్ అవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

అందుకే, ‘బిచ్చగాడు’ సినిమాకి కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ సినిమాని తీసుకురాబోతున్నాడు విజయ్‌ ఆంటోనీ. పైగా తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటం విశేషం. ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.

నిజానికి విజయ్ ఆంటోనీ మొదట సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఎడిటర్ గా మారాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎడిటర్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మళ్ళీ హీరో అవతారం ఎత్తాడు. మొత్తానికి హీరోగా విజయవంతం అయ్యాడు. అలాగే విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారబోతున్నాడు. పైగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper