చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సువార్త ప్రవచకుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టబోతున్నాడు. ఏపీలోని అతిపెద్ద సమస్యపై ఆయన ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ మార్చి 21 నుంచి న్యూ ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష ప్రారంభించనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.
Also Read: చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కూడా తాను చేపట్టే దీక్ష ఉంటుందని పాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
ఈ క్రమంలోనే కేఏ పాల్ రైతుల నాయకుడు.. భారతీయ కిసాన్ సంఘ్ కన్వీనర్ రాకేశ్ టికాయత్ ను న్యూ ఢిల్లీలో కలుసుకున్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించారు. రైతులను నాశనం చేసే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: ప్రజల సొమ్ముతో జగన్ ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపు..!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పాల్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే కాకుండా, ప్రజలను, ముఖ్యంగా రైతులను కూడా విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను, ఇతర రైతుల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టికాయత్ సైతం ప్రకటించారు. “మేము ఉక్కు కర్మాగారం విషయంలో ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కార్మికుల పక్షాన నిలబడతాము. కేంద్రం తన కఠినమైన చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా ఆందోళనను ఉపసంహరించుకునే ప్రశ్న లేదు ”అని కేఏ పాల్ హెచ్చరించారు.