లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ పెళ్ళి పై గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న పుకార్ల పరంపరకు మొత్తానికి బ్రేక్ పడింది. తాజాగా నెటిజన్లతో సంభాషించిన విఘ్నేష్ శివన్ నయనతారతో తన పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. .ఇందులో భాగంగా ఓ యూజర్ ‘మీరు, నయనతారను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ? మీ పెళ్లి కోసం మేము చాలా ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆశగా అడిగేశాడు.
ఆ నెటిజన్ ఎమోషనల్ గా అడిగే సరిగి విఘ్నేష్ శివన్ ఆ ఎమోషన్ కి కామెడీ టచ్ ఇస్తూ.. ‘వివాహం ఖరీధైనది కదా, ఆ శుభ కార్యక్రమానికి ప్రస్తుతం నేను డబ్బు ఆదా చేస్తున్నాను’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు. పనిలో పనిగా త్వరగా కరోనా వెళ్లిపోవాలని తానూ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద పెళ్లికి తామిద్దరం సిద్ధంగానే ఉన్నామని, కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పెళ్లి చేసుకుంటామని విఘ్నేష్ శివన్ ఇన్ డైరెక్ట్ గా అభిమానులకు క్లూ ఇచ్చాడు.
మరి విఘ్నేష్ చెప్పినదాన్ని బట్టి ఈ ఏడాది చివర్లోనే ‘విఘ్నేష్ – నయనతార’ వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక మరో నెటిజన్ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. నయనతార వండే వంటకాల్లో మీకు ఏం ఇష్టం ? అడగగా.. విఘ్నేష్ సమాధానం ఇస్తూ.. ‘ఘీ రైస్, చికెన్ కర్రీ’ అని తెలిపారు. అంటే లేడీ సూపర్ స్టార్ చికెన్ కర్రీ బాగా చేస్తోంది అన్నమాట అంటూ నెటిజన్లు నయన్ ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం ‘కాతు వాకులా రేండు కదల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సమంత కూడా కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు నయనతార వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా వస్తూనే ఉన్నా.. నయనతార మాత్రం దేనికి సమాధానం చెప్పదు అంటూ ఆమె ఫ్యాన్స్ నయన్ పై అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.