https://oktelugu.com/

హీరో శర్వానంద్ మరో ప్రయోగం..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగాత్మక చిత్రానికి పూనుకున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ అనే పేరుతో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఎప్పుడూ డిఫెరెంట్, కుటుంబ కథా చిత్రాలను తీసే శర్వానంద్ తాజాగా మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఈ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. రీతూ వర్మ కథానాయిక. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 / 06:27 PM IST
    Follow us on

    టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగాత్మక చిత్రానికి పూనుకున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ అనే పేరుతో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

    ఎప్పుడూ డిఫెరెంట్, కుటుంబ కథా చిత్రాలను తీసే శర్వానంద్ తాజాగా మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.

    కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఈ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని కీలక పాత్రధారి. ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

    ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. శర్వానంద్ భుజానికి గిటార్ తగిలించుకొని ఆడియో క్యాసెట్ల నుంచి మొదలై.. విమానం, పుస్తకాలు, గ్రామం, గుడి ఇలా చుట్టు తిరుగుతున్న అతడి జ్ఞాపకాలు అంటూ అద్భుతంగా పోస్టర్ డిజైన్ చేశారు. చూస్తుంటే ఈ సినిమా మానవ సంబంధాలు కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్టుగా తెలుస్తోంది.