అందుకే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా, ఆమె క్యారెక్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. అలాగే మోహన్ రాజా స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో కొన్ని పాత్రలను యాడ్ చేసినట్లు సమాచారం. అయితే మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్ర కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో బాలీవుడ్ నటి ‘విద్యా బాలన్’ నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ పాత్ర విద్యాబాలన్ చేస్తే.. మరి కుష్బూ ఏ పాత్రలో నటిస్తోందో చూడాలి. నిజానికి ఈ పాత్ర పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. మొదట సుహాసిని అన్నారు, ఆ తర్వాత రోజా పేరు కూడా వినిపించింది.
మధ్యలో అనసూయ కూడా నటిస్తోంది అన్నారు. చివరకు విద్యాబాలన్ పేరును ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ వెరీ స్టైలిష్ గా ఉండబోతుంది. అందుకే ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.