https://oktelugu.com/

Janasena lead: పరిషత్ ఫలితాలు: టీడీపీ స్థానంలోకి జనసేన రాబోతోందా?

Janasena lead:రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం.. రాజ్యాధికారం కోసం కాదు.. ప్రజల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చారు. పార్టీ స్థాపించారు. మొదటి దఫా అసలు పోటీనే చేయలేదు. రెండోసారి పోటీచేసినా గెలవలేదు. అసలు నా టార్గెట్ 25 ఏళ్లు అని.. ఏపీ రాజకీయాల్లో సీఎం కుర్చీ కోసం రాలేదని.. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానన్నాడు. పార్టీ పదేళ్లు అయినా కూడా ఎప్పుడూ పదవుల గురించి ఆలోచించకుండా పోరాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2021 / 08:26 PM IST
    Follow us on

    Janasena lead:రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం.. రాజ్యాధికారం కోసం కాదు.. ప్రజల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చారు. పార్టీ స్థాపించారు. మొదటి దఫా అసలు పోటీనే చేయలేదు. రెండోసారి పోటీచేసినా గెలవలేదు. అసలు నా టార్గెట్ 25 ఏళ్లు అని.. ఏపీ రాజకీయాల్లో సీఎం కుర్చీ కోసం రాలేదని.. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానన్నాడు. పార్టీ పదేళ్లు అయినా కూడా ఎప్పుడూ పదవుల గురించి ఆలోచించకుండా పోరాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పొచ్చు.

    ఏపీ పరిషత్ ఎన్నికలతో టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. అధికార వైసీపీ ఆల్ మోస్ట్ క్లీన్ స్వీప్ చేయగా.. కేవలం పదిలోపు స్థానాలను గెలుచుకున్న టీడీపీ మనుగడ ఇక కష్టమేనంటున్నారు.

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైసీపీ విజయం సాధించడం విశేషం. దాదాపు క్లీన్ స్వీప్ గా జగన్ పార్టీ చేయడం గమనార్హం. ఇంత ఏకపక్షంగా తీర్పు ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇక ప్రతిపక్ష టీడీపీ కేవలం 6 జడ్పీటీసీలు కైవసం చేసుకుంది. 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు. అసలు బీజేపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం.

    ఇక 7219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 చోట్ల జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధించారు.

    ఈ ఫలితాలతో చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా టీడీపీ గురించి మీడియాలో వార్తలు వస్తున్నా కానీ.. వాస్తవం చూస్తే మాత్రం టీడీపీ అనేది ఆంధ్రాలో పూర్తిగా దెబ్బతిన్నదన్నది వాస్తవం. ఎందుకంటే ప్రజల్లో టీడీపీ మీద క్రెడిబిలిటీ లేదు. అదైతే ఈ ఫలితాలతో అర్థమవుతోంది. అదే టైంలో ఏపీలో వైసీపీకి ధీటైన ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. అయితే తాజా ఫలితాలతో ఒక చిన్నా ఆశాదీపంగా జనసేన నిలబడింది. జనసేన ఇప్పుడున్న పార్టీల్లో కనపడడానికి సంఖ్యా పరంగా పెద్దగా సాధించకపోయినా కానీ.. ఏపీలోని అతిపెద్దవైన ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం దాని ఉనికిని బాగా చాటుకున్నాయి. ఆల్ మోస్ట్ టీడీపీకి సమాన స్థాయిలో ఈ జిల్లాలో జనసేనకు సీట్లు రావడం గమనార్హం. తూర్పు, పశ్చిమ, గోదావరి జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానాన్ని సైతం జనసేన సాధించింది.

    ఇది రాబోయే భవిష్యత్ కు సంకేతంగా చెప్పొచ్చు. ఏపీలో మూడో ప్రత్యామ్మాయం కోసం జనాలు చూస్తున్నారు. ఏపీ రాజకీయం చూస్తే కమ్మ, రెడ్ల మధ్యేసాగుతోంది. వీరు జనాభాలో అత్యల్పమే. కానీ రాజ్యాధికారం మాత్రం వీరి చేతుల్లోనే ఉంది. ఏపీ జనాభాలో అత్యధికంగా ఉన్న దళితులు, కాపులు మాత్రం సొంతంగా రాజ్యాధికారంలో లేరు. ఆ నేతలు వీరికిందే పనిచేస్తున్నారు.

    మెజార్టీ సంఖ్యలో ఉన్న కాపులు ఏపీలో రాజ్యాధికారం కోసం ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ ఇప్పటికీ వారి కల నెరవేరడం లేదు. కమ్మ, రెడ్ల పార్టీల్లో రెండో తరం నేతలుగానే మిగిలిపోతున్నారు. ప్రజారాజ్యం పార్టీ రావడంతో కాపుల్లో ఐక్యత వచ్చి ఉభయగోదావరి జిల్లాల్లో తమ సామాజికవర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా జనసేనను ఆదరిస్తున్నారు. ఇదే గనుక రాష్ట్రవ్యాప్తంగా కాపులు ఐక్యత చూపితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేనకు చాలా మైలేజ్ చేకూరుతుంది. గుంటూరు, కృష్ణలో జనసేనకు మేము అండగా ఉన్నామని కాపులు చాటారు. వైజాగ్ లోనూ కాపులు మెజార్టీలో ఉన్నారు. కానీ అక్కడ పెద్దగా జనసేనకు ఆదరణ దక్కలేదు.

    సో మొత్తం మీద చూస్తే.. తెలుగుదేశం విశ్వసనీయత రోజురోజుకు తగ్గుతూ ఉంది. ఇదే సమయంలో జనసేన కనుక పకడ్బందీ వ్యూహంతో వచ్చే రెండున్నర సంవత్సరాలు ముందుకు వెళ్లగలిగినట్లైతే.. ప్రజల మధ్యకు వచ్చి పవన్ కళ్యాణ్ కృషి చేసినట్లు అయితే ఖచ్చితంగా వైసీపీకి ప్రధాన పోటీదారుగా జనసేన ఎదిగే అవకాశం ఉంది. 2024లో జనసేన అధికారంలోకి వస్తుందా? అంటే ప్రస్తుతం వైసీపీ ఊపు చూస్తే కష్టమే అనిపిస్తోంది. కానీ గట్టి ప్రత్మామ్మాయంగా 2024 వరకు జనసేన ఎదిగే అవకాశం ఉంది. టీడీపీని కూలదోసి బలమైన ప్రతిపక్షంగా నిలబడే సత్తా జనసేనకు ఉంది. దీనికి ఈ వచ్చే రెండు సంవత్సరాలు ప్రజల్లో పవన్ గట్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని చెప్పొచ్చు.

    ఇక బీజేపీ చూస్తే ఆంధ్రాలో అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఏపీ పరిషత్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క జడ్పీటీసీ స్థానం దక్కలేదు. 28 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే దక్కాయి. బీజేపీ మీద ఏపీలో బాగా వ్యతిరేక సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. బీజేపీ ఏపీ విషయంలో అవలంబిస్తున్న తీరుతో ఆ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఇక్కడ యువ నాయకత్వం వస్తే తప్పితే ఆ పార్టీ గట్టేక్కే పరిస్థితులు కనిపించడం లేదు.

    ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. కానీ జనసేన పెద్ద పార్టీగా అవతరిస్తోంది. బీజేపీ అసలు ఉనికిలేకుండా పోతోంది. ఒకవేళ పవన్ విడిపోయినా.. కలిసి ఉన్నా ప్రత్యామ్మాయ శక్తిగా జనసేననే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ బలంగా లేకపోవడంతో సెకండరీ రోల్ పోషిస్తూ జనసేనకు అవకాశం ఇవ్వాలి. పవన్ కు మద్దతిస్తూ వెనుకండి బీజేపీ నడిపిస్తేనే బెటర్ అంటున్నారు. దేశంలోనే బలమైన పార్టీ బీజేపీతో ఉంటేనే పవన్ కు రాజకీయంగా మేలు. సో ఏపీలో బీజేపీని కలుపుకొని పవన్ కలుపుకొని పోతేనే మేలు జరుగుతుంది. పవన్ ప్రజల మధ్యకు వచ్చి ఈ రెండున్నర సంవత్సరాలు పనిచేస్తే ఖచ్చితంగా టీడీపీ స్థానంలోకి రాగలదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..