BheemlaNayak – Blitz of Daniel Shekar: భీమ్లా నాయక్ నుంచి ‘డేనియల్ శేఖర్’.. హీరో వచ్చేశాడట..

BheemlaNayak – Blitz of Daniel Shekar: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళంలో గ్రాండ్ హిట్ అయిన ‘అయ్యప్పమ్ కోషియమ్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ , రానాలు కలిసి నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్, పాటలు వైరల్ అయ్యాయి. తాజాగా సినిమాలో విలన్ అయిన రానాపై ఓ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు. […]

Written By: NARESH, Updated On : September 20, 2021 7:11 pm
Follow us on

BheemlaNayak – Blitz of Daniel Shekar: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళంలో గ్రాండ్ హిట్ అయిన ‘అయ్యప్పమ్ కోషియమ్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ , రానాలు కలిసి నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్, పాటలు వైరల్ అయ్యాయి. తాజాగా సినిమాలో విలన్ అయిన రానాపై ఓ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు. రానా క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా దీన్ని రూపొందించారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. టైటిల్ పాత్రని పవన్ కళ్యాణ్ పోషిస్తుండగా.. విలన్ గా రానా ‘డేనియల్ శేఖర్’గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

రానా పాత్రకు సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ లాగానే ఈ సినిమాలో హీరో రానా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పంచె ధరించి మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. ‘మీ ఆయన గబ్బర్ సింగ్ అని స్టేషన్ లో టాక్ నడుస్తోంది.. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర.. హీరో’ అంటూ పవన్ భార్య పాత్రధారితో రానా చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

ఇక కారుపై నిలుచొని రానా ఠీవీగా చెబుతున్న డైలాగులు సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ అని చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్ లోనూ పవన్ ముందు రానా దర్జాగా కూర్చొని మీసం మెలివేస్తున్న తీరు ఆకట్టుకుంటోంంది. మొత్తం ‘భీమ్లానాయక్’ నుంచి విడుదల చేసిన రానా టీజర్ పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

-భీమ్లా నాయక్ రానా టీజర్ ఇదే..