Guntur Karam movie video leak : గుంటూరు కారం నుండి వీడియో లీక్… దుమ్మురేపుతున్న మహేష్-శ్రీలీల!

గుంటూరు కారం మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గుంటూరు కారం చిత్రంపై అంచనాలు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : December 21, 2023 11:58 am
Follow us on

Guntur Karam movie : గుంటూరు కారం మూవీకి లీకుల బాధ తప్పడం లేదు. విడుదల తేదీకి సమయం దగ్గరపడుతుండగా… చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం నుండి అనేక లీక్స్ వచ్చాయి. సెట్స్ నుండి వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా మరో వీడియో లీకైంది. మహేష్ బాబు-శ్రీలీల డాన్స్ చేస్తున్న వీడియో హల్చల్ చేస్తుంది. ఇది మాస్ బీట్ సాంగ్ అని అర్థం అవుతుంది. మహేష్, శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్స్ తో దుమ్మురేపారు.

Also Read :  సంక్రాంతి బరిలో వెనకబడ్డ మహేష్ బాబు, వెంకటేష్…

గుంటూరు కారం మూవీలో మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల మెయిన్ హీరోయిన్. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటిస్తుంది. పూజ హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరికి ఛాన్స్ దక్కింది. గుంటూరు కారం నుండి రెండు సాంగ్స్ విడుదలయ్యాయి.

మహేష్ ఇంట్రో సాంగ్… దమ్ మసాలా ఆకట్టుకుంది. అయితే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. లిరిక్స్, ట్యూన్ అవుట్ డేటెడ్ గా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ పై రామజోగయ్య శాస్త్రి ఫైర్ అయ్యాడు. మహేష్ ఫ్యాన్స్ ని కుక్కలతో పోల్చడం వివాదాస్పదం అయ్యింది.

Also Read :  బాలయ్యా.. మళ్లీ తడబడ్డాడు.. వైరల్ వీడియో

థమన్ ట్యూన్స్ నచ్చని మహేష్ బాబు ప్రాజెక్ట్ నుండి తొలగించే ప్రయత్నం చేశారని టాక్ వినిపించింది. ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరి కాంబో సెట్ అయ్యింది. గుంటూరు కారం మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గుంటూరు కారం చిత్రంపై అంచనాలు ఉన్నాయి.