Pushpa 2 Movie : వరల్డ్ వైడ్ పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతుంది. రెండు రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూళ్ళను అందుకున్న పుష్ప 2.. రూ. 1000 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తుంది. నార్త్ అమెరికాలో పుష్ప 2 కలెక్షన్స్ $ 8 మిలియన్ దాటేశాయి. ఇక హిందీలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. ఎవిరీ డే రికార్డు నమోదు చేస్తుంది.
డే వన్ రూ. 72 కోట్ల వసూళ్లతో షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉన్న రూ. 65 కోట్ల రికార్డు బ్రేక్ చేసింది. మూడో రోజు డే వన్ కి మించి రూ. 74 కోట్ల వసూళ్లు హిందీ వెర్షన్ అందుకుంది. వీకెండ్ ముగిసే నాటికి పుష్ప 2 హిందీ వెర్షన్ దాదాపు రూ. 300 కోట్లకు చేరుకోనుంది. పుష్ప 2 సక్సెస్ ని టీం ఎంజాయ్ చేస్తున్నారు. శనివారం రాత్రి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే పుష్ప 2 చిత్రానికి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి రివ్యూ చెప్పింది. ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పుష్ప 2 సినిమా చూశాను. ఆ ట్రాన్స్ నుండి బయటకు రాకముందే మీతో నా అనుభవం పంచుకోవాలి అనుకుంటున్నాను. అల్లు అర్జున్ కి కళామతల్లి ఆశీస్సులు ఉన్నాయి. అందుకే నట విశ్వరూపం చూపించాడు. కళామతల్లి బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప అలాంటి నటన సాధ్యం కాదు.
అల్లు అర్జున్ గారు వంద గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి. సుకుమార్ అంత అమాయకంగా కనిపిస్తారు. ఇంత గొప్పగా సినిమా ఎలా తీశారు. సినిమా అప్పుడే అయిపోయిందా అనే భావన కలిగింది. అల్లు అర్జున్ కి రెండోసారి నేషనల్ అవార్డు రావడం ఖాయం, అని ఆమె అన్నారు. వీణా శ్రీవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో ఉంటారు. వీణశ్రీవాణి ఆయన సతీమణి. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్. రీల్స్ చేస్తుంది. ఆ మధ్య వేణు స్వామి నాగ చైతన్యను ఉద్దేశించి చేసిన కామెంట్స్ విషయంలో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేశాడు.