https://oktelugu.com/

BalaKrishna : తండ్రి లేని ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యత తీసుకున్న బాలకృష్ణ.. కొంపదీసి కోడలిని చేసుకోడు కదా!

తండ్రికి దూరమైన ఓ యంగ్ హీరోయిన్ బాధ్యత తీసుకున్నాడు బాలకృష్ణ. ఒక తండ్రిగా మారి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. మంచి అబ్బాయిని తన కోసం వెతుకుతాను అన్నాడు. ఎలాంటి సంబంధం లేని ఆ హీరోయిన్ కోసం బాలకృష్ణ ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నాడు? వివరాలు...

Written By:
  • S Reddy
  • , Updated On : December 8, 2024 / 05:41 PM IST

    BalaKrishna

    Follow us on

    BalaKrishna :  బాలకృష్ణ అంటే చాలా మందికి భయం. సినిమా ప్రముఖులు కూడా ఆయన గురించి ఆచితూచి మాట్లాడతారు. అభిమానులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం చిరాకు వచ్చినా చేతికి పని చెబుతాడు. పబ్లిక్ లో అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు అనేకం. ఇటీవల హీరోయిన్ అంజలిని వేదిక మీద వెనక్కి తోయడం వివాదమైంది. నేషనల్ మీడియా సైతం మహిళల పట్ల, స్టార్ హీరో అనుచిత ప్రవర్తన అంటూ కథనాలు వెలువడ్డాయి. బాలకృష్ణకు నాతో చాలా చనువు ఉంది. అందుకే ఆయన నన్ను తోశారు. ఆయనేమీ నాతో దురుసుగా ప్రవర్తించలేదని, అంజలి స్వయంగా వివరణ ఇచ్చారు.

    కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్.. బాలయ్య మీద ఆరోపణలు చేశారు. సెట్ లో ఎవరైనా నవ్వితే బాలయ్యకు నచ్చదు. ఒకసారి నా అసిస్టెంట్ ని కొట్టబోతుంటే, బ్రతిమిలాడి ఆపాను, అన్నారు. అయితే ఇదంతా బాలయ్యలోని ఒక కోణం మాత్రమే. ఆయనలో కొందరికి మాత్రమే తెలిసిన మరో కోణం ఉంది. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్థత్వం. మనుషులను ఆయన బాగా నమ్ముతాడట. ఇష్టమైన వ్యక్తుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు అట.

    తాజాగా బాలకృష్ణ ఓ హీరోయిన్ పెళ్లి బాధ్యత తీసుకున్నాడు. తనతో భగవంత్ కేసరి చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీలీలకు పెళ్లి చేస్తానని బాలకృష్ణ అన్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా శ్రీలీల , నవీన్ పోలిశెట్టి వచ్చారు. ఈ యంగ్ ఫెలోస్ తో బాలకృష్ణ సరదా సంభాషణలు జరిపారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈ సందర్భంగా… శ్రీలీల నాకు కూతురు లాంటిది. ఆమెను చూస్తుంటే నా పిల్లలే గుర్తుకు వస్తున్నారు. శ్రీలీలకు ఒక తండ్రిగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది, అన్నారు.

    ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల బాలయ్యకు కూతురు వరసతో సమానమైన పాత్ర చేసింది. ఆ మూవీ షూటింగ్ టైం లో వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో శ్రీలీల హీరోయిన్ అనే ప్రచారం ఉంది. ఆ మధ్య శ్రీలీలను మోక్షజ్ఞకు భార్యగా తెచ్చే ఆలోచన కూడా బాలయ్య మదిలో ఉందంటూ పుకార్లు వెలువడ్డాయి. కాగా శ్రీలీల అమెరికాలో పుట్టింది. మనస్పర్థలతో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. శ్రీలీల తల్లి అమెరికా నుండి వచ్చి బెంగుళూరులో సెటిల్ అయ్యింది. శ్రీలీల తల్లి వద్దే పెరిగింది.