https://oktelugu.com/

Jabardasth : జబర్దస్త్ లో డబ్బులు ఎగ్గొట్టారు.. నా భార్య అడుక్కొచ్చి తిండి పెట్టింది.. కమెడియన్ గడ్డం నవీన్ పరిస్థితి ఇంత ఘోరమా!

ఒకానొక సమయంలో జేబులో 400 వందలు ఉంటే ఎక్కువ. తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడ్డామని గడ్డం నవీన్ అన్నారు. చాలా సార్లు నా భార్య పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి అన్నం పెట్టిందని చెప్పి గడ్డం నవీన్ ఆవేదన చెందాడు.

Written By: , Updated On : April 16, 2024 / 08:08 PM IST
Jabardasth.. Comedian Gaddam Naveen

Jabardasth.. Comedian Gaddam Naveen

Follow us on

Jabardasth : బుల్లితెర పై జబర్దస్త్ షో ఒక సెన్సేషన్. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి వారు సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షో వల్ల కొందరు కమెడియన్స్ కనీస సంపాదన లేక అల్లాడుతున్నారు. ఒకప్పటి సీనియర్ కమెడియన్స్ షోకి దూరం అయ్యారు. కొందరు ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి వారిలో గడ్డం నవీన్ ఒకరు.

గడ్డం నవీన్ అదిరే అభి టీంలో స్కిట్స్ చేసేవాడు. ఆయన తనదైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏళ్ల తరబడి జబర్దస్త్ కమెడియన్ గా ఉన్నాడు. కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గడ్డం నవీన్ జబర్దస్త్ షో లో తనకి ఎదురైన అవమానాలు, జీవితంలో ఆయన పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. జబర్దస్త్ వాళ్ళు కొన్ని ఎపిసోడ్స్ కి డబ్బులు ఇవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒకానొక సమయంలో జేబులో 400 వందలు ఉంటే ఎక్కువ. తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడ్డామని గడ్డం నవీన్ అన్నారు. చాలా సార్లు నా భార్య పక్కింటి వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి అన్నం పెట్టిందని చెప్పి గడ్డం నవీన్ ఆవేదన చెందాడు. దాదాపు 170 సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కడో వెనుక నిలబడే పాత్రలే చేశానని గడ్డం నవీన్ తెలిపాడు.

మీరు జబర్దస్త్ లో కనిపించక పోవడానికి కారణం ఏమిటని యాంకర్ అడగ్గా .. అదిరే అభి ఉన్నప్పుడు జబర్దస్త్ లో స్కిట్స్ చేయడానికి ఎక్కువ అవకాశం దొరికేది. అభి జబర్దస్త్ మానేసిన తర్వాత ఒంటరి పక్షులం అయిపోయాం. అభి వెళ్ళిపోయాక తమను పట్టించుకునే వాళ్ళు లేక జబర్దస్త్ లో అవకాశాలు రావడం లేదని నవీన్ క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ డబ్బులు కూడా సరిగా ఇవ్వరని, తనతో 80 నుంచి 90 ఎపిసోడ్లు పని చేయించుకుని రూపాయి కూడా ఇవ్వలేదని గడ్డం నవీన్ జబర్దస్త్ మోసాలు బయటపెట్టాడు.