Venu Swamy On Sreeleela: వేణుస్వామి.. స్టార్ హీరోయిన్ సమంత.. హీరో నాగచైతన్య జాతకాలు చెప్పి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. వాస్తవానికి ఎప్పటి నుంచో సినిమా, రాజకీయ రంగాల వారికి జాతకాలు చెబుతున్నారు. నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పారు. ఆయన చెప్పినట్లే జరుగడంతో.. ఒక్కసారిగా ఆయన స్టార్ ఆస్ట్రాలజిస్టు అయ్యారు. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మూడేళ్ల క్రితం చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. 2022 ఆగస్టు తర్వాత చంద్రబాబు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని చెప్పారు. ఆయన చెప్పినట్లే 2023 ఆగస్టు తర్వాత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన స్టార్ హీరోయిన్ శ్రీలీల జాతకం చెప్పారు. సంచలన విషయాలు బయటపెట్టారు.
ఐదేళ్లు తిరుగు లేదు..
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాల్లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. శ్రీకాంత్ కొడుకుతో కలిసి పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించింది. తెలుగింటి అమ్మాయే అయినప్పటికి పుట్టి పెరిగింది కర్ణాటకలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. వైద్య విద్య అభ్యసించి తిగిరి ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్నన్ని సినిమాలు ఏ హీరోయిన్ చేతిలో లేవు. తాజాగా వేణుస్వామి ఆమె జాతకం చెప్పాటు. టాలీవుడ్‌లో ఆమెకు మరో ఐదేళ్లు తిరుగు ఉండదని పేర్కొన్నారు.
జాతకం ఇలా..
వేణుస్వామి చెప్పిన ప్రకారం శ్రీలీలది మీనరాశి. ఆమె జాతకంలో రవి, గురు, శని, శుక్ర గ్రహాలు ఆధారంగా శ్రీలీల జాతకం విశ్లేషించారు. శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడని వేణుస్వామి తెలిపారు. రవి, గురు, శని పదో స్థానంలో ఉన్నారు. ఈ కారణంగా శ్రీలీలకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయని వెల్లడించారు. అవకాశాలు కూడా అనేకం వస్తాయని తెలిపారు. ఆదాయం కూడా దండిగా ఉంటుందని పేర్కొన్నారు. జాతకరిత్యా అన్నీ శ్రీలీలకు అనుకూలంగా ఉన్నాయని, కలిసి వస్తాయని తెలిపారు.
2028 వరకు అనుకూలం..
2023 జూన్ నుంచి.. 2028 చివరి వరకు శ్రీలీలకు అనుకూలమైన ఫలితాలే వస్తాయని వేణుస్వామి స్పష్టం చేశారు. టాలీవుడ్‌తోపాటు సౌత్ ఇండియాలోని రెండు మూడు భాషల్లో విపరీతమైన అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
ఆ హీరోయిన్ల లాంటి జాతకం..
శ్రీలీల జాతకం.. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సాధించిన నయనతార, సమంత, అనుష్క, కాజల్ అగర్వాల్ లాంటిదని వేణుస్వామి వెల్లడించారు. ఈ నలుగురు టాలీవుడ్‌లో చాలాకాలం ఉన్నారని… వారిలాగానే శ్రీలాల ఐదేళ్లకుపైగా ఇండస్ట్రీలో రాణిస్తుందని లె లిపారు.
2024 తర్వాత ఆ హీరోయిన్లు తెరమరుగు..
ఇక వేణుస్వామి మరో సంచలన విషయం కూడా చెప్పారు.. 2024 తర్వాత టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు తెరమరుగవుతారని తెలిపారు. అలాంటి వారిలో పూజాహెగ్డే, సమంత, రష్మిక మందన ఉన్నట్లు వెల్లడించారు. వీరి స్థానాన్ని శ్రీలీల పూర్తిగా ఆక్రమిస్తుందని స్పష్టం చేశారు. ఐదేళ్లకుపైగా శ్రీలీల ఆధిపత్యం కొనసాగుతుందని వేణుస్వామి పునరుద్ఘాటించారు. ఆయన చెప్పివన్నీ నిజమవుతున్న నేపథ్యంలో త్వరలో పూజాహెగ్డే, సమంత, రష్మిక మందన తెరమరుగు కావడం ఖాయం. శ్రీలీల నంబర్ వన్ కావాలి. మరి 2024లో వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా.. లేదా చూడాలి.