Venu Swamy , Mahesh babu
Venu Swamy and Mahesh babu : ప్రముఖుల జాతకాలు బహిరంగంగా చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి. ఈయనకు పరిశ్రమతో సంబంధాలు ఉన్నాయి. టీనేజ్ లో వేణు స్వామి కొత్త సినిమాల పూజా కార్యక్రమాలను నిర్వహించేవాడు. బడా బడా స్టార్స్ నటించిన చిత్రాల లాంచింగ్ సెరిమోని వేణు స్వామి చేతుల మీదుగా జరగడం విశేషం. వేణు స్వామికి కొందరు భక్తులు ఉన్నారు. ఆయన పూజలు చేస్తే కెరీర్ విజయపథంలో సాగుతుందని నమ్మేవారు ఎందరో ఉన్నారు. దేశాన్ని ఊపేస్తున్న స్టార్ లేడీ రష్మిక మందాన వేణు స్వామి శిష్యురాలు కావడం విశేషం. రష్మికతో పలుమార్లు వేణు స్వామి పూజలు చేయించాడు.
Also Read : బయటపడ్డ వేణు స్వామి బాగోతం… ఇంట్లో పూజలు బయట జల్సాలు!
ఈ లిస్ట్ లో మరికొందరు హీరోయిన్స్, బుల్లితెర సెలెబ్స్ ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటారని టాక్. ఆ విషయాన్ని వేణు స్వామి స్వయంగా వెల్లడించాడు. అయితే వేణు స్వామి చెప్పే జాతకాలు వివాదం రేపుతూ ఉంటాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో పలువురు స్టార్స్ మీద జాతకాల పేరుతో వేణు స్వామి అనుచిత కామెంట్స్ చేశాడు. ఇటీవల వివాహం చేసుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లపై వేణు స్వామి నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
శోభితతో కూడా నాగ చైతన్యకు విడాకులు అవుతాయి. మూడేళ్ళలో విడిపోతారు. అసలు నాగ చైతన్యకు తండ్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలపై పరిశ్రమ సీరియస్ అయ్యింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు వేణు స్వామికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇకపై ప్రముఖుల జాతకాలు బహిరంగంగా చెప్పను అని వేణు స్వామి మాటిచ్చాడు. కానీ మాట తప్పుతూ సమంత, ప్రభాస్, విజయ్ దేవరకొండ చనిపోతారు. ఆత్మహత్య చేసుకుంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం మహేష్ బాబు జాతకం వలనే జరిగింది అంటూ మరో బాంబు పేల్చాడు. వేణు స్వామి మాట్లాడుతూ.. కృష్ణ గారి ఇంట్లో నేను పూజలు చేస్తూ ఉండేవాడిని. 2020 తర్వాత మీ కుటుంబంలో మరణాలు సంభవిస్తాయని విజయనిర్మలతో అన్నాను. నరేష్ నా మీద కోప్పడ్డారు. అమ్మ ఆరోగ్యం సరిగాలేదు. ఆమెకు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పావని సీరియస్ అయ్యాడు. అప్పటి నుండి నన్ను పూజలకు పిలవడం మానేశారు. మహేష్ బాబుది సింహరాశి. నేను మహేష్ బాబు జాతకం చెప్పే నాటికి శనిగ్రహం ప్రవేశిస్తుంది. జనవరి 16 తర్వాత తల్లిదండ్రులకు చెడు జరుగుతుందని చెప్పాను. మహేష్ బాబు జాతకం వలనే కృష్ణ మరణం సంభవించింది, అన్నారు. వేణు స్వామి కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న సినిమాలో నటించనున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…