SSMB 29
SSMB 29 : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది ప్రియాంక చోప్రా. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. సడన్ గా ఆమె హిందీ పరిశ్రమకు దూరమైంది. హాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. గ్లోబల్ ఫేమ్ రాబట్టిన ప్రియాంక చోప్రా అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. ప్రియాంక కంటే నిక్ దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడు. ఈ విషయంలో ప్రియాంక చోప్రా ట్రోలింగ్ కి గురైంది. ఇక బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ. నాకు ఆఫర్స్ రాకుండా కొందరు కుట్ర చేశారు. ఈ క్రమంలో గొడవలు అయ్యాయి. అందుకే నేను హిందీ పరిశ్రమను విడిచిపోయానని ఓ సందర్భంలో ప్రియాంక చోప్రా వెల్లడించింది.
Also Read : SSMB 29 లీక్… రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!
కాగా ప్రియాంక చోప్రా సిటాడెల్ టైటిల్ తో ఒక సిరీస్ చేసింది. స్పై థ్రిల్లర్ గా సిటాడెల్ రూపొందింది. ప్రియాంక చోప్రాకు జంటగా రిచర్డ్ మాడెన్ నటించాడు. 2023లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. సిటాడెల్ సిరీస్ బడ్జెట్ 300 మిలియన్ డాలర్స్ అని సమాచారం. ఇండియన్ కరెన్సీలో 2560 కోట్ల రూపాయలు. ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సిటాడెల్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. ప్రేక్షకుల నుండి స్పందన కరువైంది. దాంతో 250 మిలియన్ డాలర్స్ ప్రైమ్ నష్టపోయినట్లు సమాచారం. అనగా రూ. 2135 కోట్లు.
సిటాడెల్ నష్టాలతో ప్రైమ్ సంస్థ ఖంగు తిందట. ఇక సీజన్ 2 చేయాలా వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారట. సీజన్ 2 నిర్మిస్తున్న ప్రైమ్ బడ్జెట్ మాత్రం తగ్గించేసిందట. ఒక ప్రాజెక్ట్ కి రెండు వేల కోట్ల నష్టం అంటే, ఎవరూ ఊహించని పరిణామం. కాగా సిటాడెల్ సిరీస్ ని ఇండియాలో హనీ బన్నీ టైటిల్ తో రీమేక్ చేశారు. వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. హనీ బన్నీ సిరీస్ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ పొందలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత మంచి పేరు తెచ్చుకుంది. కానీ హనీ బన్నీ సిరీస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు.
మరోవైపు మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా SSMB 29లో నటిస్తుంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కొద్దిరోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో SSMB 29 సెకండ్ షెడ్యూల్ మొదలైంది.
Also Read : ఆస్తులు అమ్ముకుంటున్న SSMB 29 హీరోయిన్! రాజమౌళితో మూవీ చేస్తూ ఎందుకు ఇలా?