Venu Madhav Death Anniversary: సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా రాణించాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశాలు కొంతమందికే వస్తాయి. వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ప్రేక్షకులను అలరించిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు వాళ్ల మనుగడను కొనసాగిస్తారు. వాడుకోలేని వారు వీలైనంత తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతారు…ఇక ఇలాంటి క్రమంలోనే మిమిక్రీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘వేణుమాధవ్’ చాలా తక్కువ సమయంలోనే ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా అవతరించాడు…ఎస్ వి కృష్ణారెడ్డి తీసిన ‘సాంప్రదాయం’ సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసిన ఆయన ‘తొలిప్రేమ’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా నటించాడు. ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అక్కడి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుస అవకాశాలను అందుకుంటు ముందుకు సాగాడు. ఇక తన ఎంటైర్ కెరీర్ లో దిల్, సై, సింహాద్రి, ఛత్రపతి, వెంకీ, దుబాయ్ శ్రీను, జై చిరంజీవ లాంటి సినిమాల్లో కమెడియన్ గా నటించి గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఆయన తన కెరియర్ లో 450 కి పైన చిత్రాల్లో నటించి నటుడిగా ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి వేణుమాధవ్ 2019వ సంవత్సరంలో లివర్ కి సంబంధించిన అనారోగ్య సమస్యతో కొద్దిరోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆయన కెరియర్లో చేసిన సినిమాలు అతనికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఈరోజు ఆయన వర్ధంతి…కామెడీ కి పెద్ద పీట వేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరితో పోటీపడి మరి టాప్ కమెడియన్ గా నిలిచిన నటుడు వేణుమాధవ్… నిజానికి వేణుమాధవ్ లాంటి మ్యానరిజమ్స్ తో కామెడీని పండించే వాళ్ళు ఇప్పటివరకు దొరకలేలేదు.
ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకన్నాడు. అందుకే ఆ పాత్రలను వేణుమాధవ్ తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనేంతలా అటు దర్శకులలోను ఇటు ప్రేక్షకుల్లోనూ గొప్ప గుర్తింపు ను సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికి వాళ్ళెవ్వరు వేణుమాధవ్ తో పోటీకి రాలేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…