OG Movie: భారీ అంచనాల మధ్య రిలీజైన ఓజీ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ మూవీని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిని చూపిస్తూ ఉండడం విశేషం…గత 4 రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ మూవీ మీద అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి… అందుకే ఈ సినిమాను చూడటానికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల దాకా ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. మరి ఇలాంటి సమయంలోనే అపోజిషన్ పార్టీ నుంచి ఓజీ సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాని చూసిన చాలా మంది బావుంది అని చెబుతున్నప్పటికి ట్విట్టర్లో ‘Diseaster OG’ అనే హ్యాష్ ట్యాగ్ ను స్ప్రెడ్ చేస్తూ సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు… మరి ఎందుకని పవన్ కళ్యాణ్ మీద అంతా కోపం.. అతని సినిమాలు ఆడితే అటు రాజకీయంగా, ఇటు సినిమాలపరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
దాన్ని ఓర్చుకోలేని కొంతమంది కావాలనే ఇలాంటి కుట్రలను పన్నుతున్నారంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ విషయం మీద ఫైర్ అవుతున్నారు… కొందరు మాత్రం ఎవరు ఎన్ని దుష్ప్రచారాలను చేసిన కూడా ఈ సినిమా మౌత్ టాక్ తో భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
250 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ గా మారుతుందా? లేదా అనే ఒక క్యూరియాసిటిని కూడా ప్రేక్షకుల్లో రేకెత్తిస్తోంది…ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు రిపీటెడ్ గా ఈ సినిమాని చూస్తూ కలెక్షన్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సామాన్య జనాలు సైతం ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ఇక ఈ వీకెండ్ లో ఓజీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇప్పటికే సినిమా సెలబ్రిటీలు చాలామంది మూవీ చూసి అద్భుతంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు… ఇక ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ను ఇలాంటి స్టైలిష్ పాత్రలో అయితే చూడలేదు. అటు తన స్వాగ్ చూపిస్తూనే దానికి మించిన విధ్వంసాన్ని సృష్టించాడు.