Chiranjeevi Vs Balakrishna: వైసీపీ ప్రభుత్వం లో సినిమా పరిశ్రమకు టికెట్ రేట్స్ విషయంలో పెద్ద సమస్య ఎదురైన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సమయం లో చిరంజీవి(Megastar Chiranjeevi), మహేష్ బాబు(superstar mahesh babu), ప్రభాస్(Rebel star Prabhas) మరియు రాజమౌళి వంటి ప్రముఖులు అప్పటి మాజీ సీఎం జగన్ ని కలిసి, టికెట్ రేట్స్ పెంపుకు జీవో ని కోరడం, చిరంజీవి ఒక అడుగు ముందుకేసి చేతులెత్తి దండం పెట్టడం వంటివి మనమంతా చూసాము. అయితే నేడు అసెంబ్లీ ఈ సంఘటనకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కూటమి నేతలైన కామినేని శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగడం ఇప్పుడు సంచలన టాపిక్ గా నిల్చింది. కామినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో సమస్యలు గురించి మాట్లాడుకుందాం రమ్మని అప్పటి సీఎం కి సంబందించిన నుండి ఒక లిస్ట్ వచ్చిందని, అందులో బాలయ్య లేడని, రాజకీయాలకు సంబంధం లేని హీరోలను పిలిచారని చెప్పుకొచ్చాడు.
అప్పుడు చిరంజీవి బ్రతిమిలాడి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లను తీసుకొస్తే గేట్ వద్దనే ఆపి సీఎం గారు మిమ్మల్ని కలవడం లేదని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చి మీతో మాట్లాడుతారని చెప్పినట్టు కామినేని శ్రీనివాస్ గుర్తు చేసాడు. ఆ తర్వాత చిరంజీవి వాళ్ళతో పోట్లాడి లోపలకు తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. దీనికి శాసనసభలో ఉన్న బాలయ్య చాలా ఘాటుగా స్పందించాడు. చిరంజీవి పోట్లాడి వాళ్ళని లోపలకు తీసుకెళ్లాడు అనేది పచ్చి అబద్దం, నన్ను కూడా పిలిచారు, నా పేరు 9 వ స్థానం లో ఉంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీనికి మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితమే కౌంటర్ ఇచ్చాడు. ఆయన స్పందించిన విధానం చూస్తుంటే బాలయ్య మాటలకు చిరంజీవి మనసు బాగా నొచ్చుకున్నట్టు అనిపిస్తుంది. చిరంజీవి పై బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు, కానీ అసెంబ్లీ సాక్షిగా చేయడం ఇదే మొదటిసారి.
చిరంజీవి స్పందిస్తూ ‘నేడు అసెంబ్లీ లో సోదరుడు బాలయ్య నాపై వ్యంగ్యంగా చేసిన మాటలను నేను టీవీ లో చూసాను. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాను. లంచ్ చేస్తున్న సమయం లో సమయం ఇస్తే మా ఇండస్ట్రీ వాళ్లంతా మిమ్మల్ని కలుస్తామని చెప్పాను. హీరోలతో కలిసి వెళ్ళినప్పుడు జగన్ నన్ను సాధారణంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమలోని ఇబ్బందులను అప్పట్లో జగన్ కి వివరించాను’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోతుందా?, లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.