Vennela Kishore and Samantha : ఈమధ్య కాలం లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి ‘హిట్ 3’ చిత్రం ద్వారా థియేటర్స్ మళ్ళీ కళకళలాడుతున్నాయి. ఇదే ఫ్లో ని రాబోయే సినిమాలు కూడా కొనసాగిస్తే బాగుండును అని బయ్యర్స్ కోరుకుంటున్నారు. ఈ నెల లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వడం అనుమానమే కానీ, కొన్ని నోటెడ్ సినిమాలు మాత్రం విడుదల అవుతున్నాయి. మే9 న శ్రీవిష్ణు హీరో గా నటించిన సింగిల్, సమంత (Samantha Ruth Prabhu) నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్'(Subham Movie) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు మంచి పాజిటివ్ బజ్ ఉంది. కొత్త వాళ్ళతో తీసినప్పటికీ కూడా ఆసక్తికరమైన ట్రైలర్ తో శుభమ్ చిత్రం మార్కెట్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక శ్రీవిష్ణు(Sree Vishnu) ‘సింగిల్ ‘(Single Movie) చిత్రానికి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
Also Read : బ్రహ్మానందంలోని ఆ గొప్పతనాన్ని బయటపెట్టిన వెన్నెల కిషోర్.. వైరల్ వీడియో
ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కాబోతుండడం తో మేకర్స్ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇకపోతే సింగిల్ చిత్రం లో సెకండ్ హీరో గా నటించిన ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) శుభమ్ చిత్ర నిర్మాత సమంత తో చేసిన ఒక ఫన్నీ లైవ్ వీడియో చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ లైవ్ చాట్ లో సమంత తన శుభమ్ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని చేసుకుంది కానీ, వెన్నెల కిషోర్ తన సింగిల్ చిత్రానికి సంబంధించిన విశేషాలను చెప్తుంటే మాత్రం ఆమె మాట్లాడినవ్వకుండా నాన్ స్టాప్ గా తన సినిమా గురించే చెప్పుకుంది. తన సినిమా గురించి చెప్పే ప్రయత్నం లో వెన్నెల కిషోర్ పడిన ఇబ్బంది నెటిజెన్స్ కి నవ్వు రప్పించింది. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇకపోతే సమంత కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్తులు గా ఉండే అతి తక్కువ మంది సెలబ్రిటీలతో ఒకరు వెన్నెల కిషోర్. ఎన్నో సందర్భాల్లో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో కూడా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని చూసి మురిసిపోతుంటారు నెటిజెన్స్. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర పోషిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం లో కూడా వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఏడాది లోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరో పక్క ఇండస్ట్రీ వర్గాల్లో మే 9 న విడుదల అవ్వబోతున్న ఈ రెండు సినిమాల పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. ‘హిట్ 3’ వచ్చిన ఊపుని, ఈ రెండు సినిమాలు కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
#subham #Single ఆడవారితో మాట్లాడి గెలవడమే… చెప్పడమే తప్ప వినడం ఉండదు గా @vennelakishore @Samanthaprabhu2 pic.twitter.com/rGYn2tg6ps
— devipriya (@sairaaj44) May 6, 2025