Vennela Kishore : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఇప్పటికే 1500ల వరకు సినిమాలు చేసిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఆయన ఒక్క కమెడియన్ మాత్రమే కాకు ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఆయన గొప్ప చిత్రకారుడు కూడా ఇప్పటికే పలు చిత్రాలను కూడా గీశారు. అలాగే మరో కమెడియన్ వెన్నెల కూడా వరుస సినిమాలో ప్రేక్షకులను నవ్విస్తున్నారు.వెన్నెల సినిమాలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి నవ్వుల హంగామా తప్పకుండా ఉంటుంది. కానీ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ నిజజీవితంలో కూడా అదే స్థాయిలో ఫన్ క్రియేట్ చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొన్ని రోజుల క్రితం బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంలో జరిగిన హాస్యరస సంఘటనను వెన్నెల కిషోర్ స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఓహో… నీ ఇంట్లోకి వచ్చానంటే బిర్యానీ ఖచ్చితంగా ఉండాలి!” అని బ్రహ్మానందం అడిగారు. “సర్, ఇంట్లో అన్నం, పెరుగు మినహా ఏం లేదు!” వెన్నెల కిషోర్ అన్నారు. దీంతో బ్రహ్మానందం తన స్టైల్‌లో నవ్వుతూ, “ఏంట్రా ఇది! నేను వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ పెరుగు అన్నమేనా?” అంటూ ఫన్నీగా సెటైర్లు వేశారు.
బ్రహ్మానందంకు ప్రత్యేక విందు!
ఆ వెంటనే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం కోసం హోటల్ నుంచి స్పెషల్ విందు తెప్పించారు. “ఇక మీదట నువ్వు రావడానికి ముందే వంట చేసినా మంచిది!” అని వెన్నెల కిషోర్ కామెంట్ చేయగా, “హ్మ్… మంచి ఆలోచన! కానీ నువ్వు వండితే భయంగా ఉంది!” అని బ్రహ్మానందం సూపర్ పంచ్ వేశారు.
తాజాగా బ్రహ్మానందం గొప్పతనం గురించి వెన్నెల కిషోర్ ఓ సినిమా ఫంక్షన్ లో బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బ్రహ్మానందం ఫోన్ చేశారని తెలిపారు. ఫోన్లో ఓరేయ్ ఎక్కడ ఉన్నావ్ అని అడిగారని చెప్పారు. సార్ నేను ఇక్కడ సినిమా షూటింగులో ఉన్నానని చెప్పానని.. ఏ సినిమా, అందులో నీ క్యారెక్టర్ ఏంటి అని నేను అడగలేదు. ఎక్కడ ఉన్నావ్ అని మాత్రమే అడిగాను. త్వరగా వచ్చి భోజనం చేసి వెళ్లు అని చెప్పినట్లు ఆయనలోని గొప్పతనాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు.
సినిమాల్లో వీరిద్దరూ కలిసి ఉన్న సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా “దూకుడు”, “రెడీ”, “బాద్‌షా”, “ఏక్‌నిరంజన్” వంటి సినిమాల్లో వీరి కామెడీ టైమింగ్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ వీరి మధ్యన కామెడీ సీన్స్ అలాగే కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి మళ్లీ ఓ మంచి కామెడీ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే అదిరిపోతుందేమో!
