Samantha: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో సమంత(Samantha Ruth Prabhu) విడాకులు తీసుకోవడం అనేది ఒక సంచలనమైన విషయం. దాదాపుగా వీళ్ళు విడాకులు తీసుకొని మూడేళ్లు కావొస్తుంది. కానీ వీళ్ళ గురించి కథనాలు మాత్రం సోషల్ మీడియా లో అసలు ఆగడం లేదు. ప్రతీ రోజు ఎదో ఒక ఆసక్తికరమైన విషయం బయట పడుతూనే ఉంది. రీసెంట్ గా సమంత ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కి లైక్ కొట్టడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే ‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెని వదిలేయాలని అనుకుంటాడు, కానీ భార్య మాత్రం అలా అనుకోదు. భర్తకు బాగాలేకపోతే రేయింబవళ్లు అతను కోలుకోడానికి కష్టపడుతుంది..అన్ని రకాల సేవలు చేస్తుంది’ అని ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఉంది. దీనికి సమంత లైక్ కొట్టడమే ఇప్పుడు వివాదాస్పదం గా మారింది.
Also Read: అల్లు అర్జున్, శ్రీలీల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..ప్రకంపనలు రేపుతున్న వివాదం!
సమంత కి రీసెంట్ గానే మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. దీని నుండి ఆమె కోలుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న కొత్తల్లో ఈ విషయం బయటపడింది. సమంత నే స్వయంగా తన అభిమానులకు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె లైక్ కొట్టిన పోస్ట్ ని అనుసంధానం చేసుకొని చూస్తే నాగ చైతన్య ఈమె అనారోగ్యం గా ఉందనే కారణంతోనే సమంత కి విడాకులు ఇచ్చాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత చిన్న దానికి విడాకులు ఇచ్చే వాడిలాగా నాగ చైతన్య ఎప్పుడు అనిపించలేదు, సమంత ఏ ఉద్దేశ్యంతో అలా లైక్ కొట్టిందో తెలియకుండా మీకు ఇష్టమొచ్చినట్టు కథనాలు రాసుకోవద్దు అనేది అక్కినేని అభిమానుల వాదన. ఒకవేళ సమంత సాధారణంగానే ఆ పోస్ట్ నచ్చి లైక్ కొట్టి ఉంటే అది కచ్చితంగా తప్పే అని అంటున్నారు నెటిజెన్స్.
ఎందుకంటే కేవలం అమ్మాయిలు మాత్రమే భర్తలకు సేవలు చేస్తారు, భర్తలు చేయరు అనే వాదన చాలా తప్పు. కేవలం ఒకటి రెండు సంఘటనలను ఆధారంగా తీసుకొని ప్రపంచం లో ఉన్న భర్తలంతా అలాగే ఉంటారు అనే అభిప్రాయం సమంత కి ఉంటే కచ్చితంగా అది పొరపాటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన మా భార్య కి కన్నతల్లి కి సేవలు చేసినట్టుగా ఇప్పటికీ సేవలు చేస్తూనే ఉన్నాం అంటూ కొంతమంది ఉదాహారణలతో సహా వాస్తవాలను తెలియజేసారు. కేవలం ఫెమినిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా మగవాళ్ళను ద్వేషిస్తారని, సమంత కూడా ఆ కోవకు చెందిన అమ్మాయేనా..?, లేదా తన వ్యక్తిగత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ పోస్టుని లైక్ చేసిందా అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభమ్’ మూవీ వచ్చే నెల 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.