https://oktelugu.com/

దర్శకుడిగా ఛాన్స్ వద్దంటున్న మేటి కమెడియన్

డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అనేది ఒకనాటి మాట . ఇపుడు డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోలుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. నాని రవి తేజ, పవన్ కళ్యాణ్ ఇలా నటులైన వాళ్ళే . ,ఇలాంటి వాళ్లు నటులుగా ఎంత పేరు సంపాదించినప్పటికీ. ఏదో ఒక మూల దర్శకత్వం చేపట్టాలన్న ఆశ మాత్రం చావదు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ సినిమా అలా వచ్చిందే. ఇపుడు అదే కోవలో మరో నటుడు […]

Written By:
  • admin
  • , Updated On : April 15, 2020 / 06:07 PM IST
    Follow us on


    డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అనేది ఒకనాటి మాట . ఇపుడు డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోలుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. నాని రవి తేజ, పవన్ కళ్యాణ్ ఇలా నటులైన వాళ్ళే . ,ఇలాంటి వాళ్లు నటులుగా ఎంత పేరు సంపాదించినప్పటికీ. ఏదో ఒక మూల దర్శకత్వం చేపట్టాలన్న ఆశ మాత్రం చావదు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ సినిమా అలా వచ్చిందే. ఇపుడు అదే కోవలో మరో నటుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ వద్దు బాబో అంటున్నాడు ..

    ‘వెన్నెల’ సినిమాతో కమెడియన్ గా తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం అయిన కిషోర్ ఏకంగా తన పేరునే వెన్నెల కిషోర్ గా మార్చు కొన్నాడు. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించి.. చాలా ఎర్లీ గానే బిజీ కమెడియన్ అయి పోయాడు. కాగా వెన్నెల కిషోర్ కూడా డైరెక్షన్ ఆశతో వచ్చి నటుడు అయిన కోవకు చెందిన వాడే.. ఐతే అతను మిగతా వాళ్లలా దర్శకత్వం చేపట్టడానికి ఎక్కువ కాలం ఎదురు చూడలేదు.

    తాను అరంగేట్రం చేసిన ‘వెన్నెల’ సినిమాకు కొనసాగింపుగా ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’తో దర్శకుడిగా మారాడు. అయితే అది చేదు అనుభవాన్ని మిగల్చడంతో వెంటనే మరో ట్రయల్ వేసాడు. కామెడీ స్టార్ బ్రహ్మానందం హీరోగా ‘జఫ్ఫా’ అనే మరో సినిమా తీశాడు. అది కూడా బాల్చీ తన్నేసింది. దీంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు కిషోర్.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్లీ దర్శకత్వం ఎప్పుడు చేస్తారు అని అడిగితే.. ‘‘నేను మళ్లీ దర్శకత్వం చేయకపోతేనే నాతో సహా అందరికీ మంచిది. ప్రస్తుతానికి నాకీ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సమీప భవిష్యత్తులో అయితే నేను దర్శకత్వం చేసే అవకాశం లేదు’’ అని స్పష్టం చేశాడు.

    నటుడిగా వెన్నెల కిషోర్ కెరీర్ ఇప్పుడు చాలా హ్యాపీ గా సాగి పోతోంది. అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు, నితిన్ చిత్రం ‘రంగ్ దె’లో కూడా నటిస్తున్నాడు .. ఇంకా అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’లోనూ అవకాశం వచ్చిందతనికి . ఇక సంపత్ నంది దర్శకత్వంలో `సీటీ మార్ ‘ చిత్రంలోహీరో గోపీచంద్ తో పోటా పోటీగా ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు . ఇవన్నీ ఒకెత్తు అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో నటిస్తున్నాడు . ఈ చిత్రం తన కెరీర్లోనే అతి పెద్ద అవకాశాల్లో ఒకటని ,. చిరంజీవితో ఆల్రెడీ ఒక వారం పని చేశానని.. ఈ ఆచార్య సినిమా విషయంలో చాలా ఆతృతగా ఉన్నానని..చెప్పాడు. ఈ యు ఎస్ రిటర్న్అయిన కమెడియన్.