https://oktelugu.com/

కరోనాపై సైబరాబాద్ పోలీసుల సాంగ్.. వైరల్

దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. లాక్డౌన్లో భాగంగా ప్రజలంతా వారివారి ఇళ్లకే పరిమితయ్యయారు. కరోనా వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. కొందరు ఎంతచెప్పినా వినకుండా రోడ్లపై వస్తుండటంతో పోలీసులు తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక పలువురు సెలబ్రెటీలు వీడియోలు, సాంగ్స్ రూపంలో కరోనాపై తమ బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు ‘ఓరోరి.. ఓరి ఓరి.. నా ఫ్రెండు.. చెప్పినట్టు విను’ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 06:16 PM IST
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. లాక్డౌన్లో భాగంగా ప్రజలంతా వారివారి ఇళ్లకే పరిమితయ్యయారు. కరోనా వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. కొందరు ఎంతచెప్పినా వినకుండా రోడ్లపై వస్తుండటంతో పోలీసులు తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇక పలువురు సెలబ్రెటీలు వీడియోలు, సాంగ్స్ రూపంలో కరోనాపై తమ బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు ‘ఓరోరి.. ఓరి ఓరి.. నా ఫ్రెండు.. చెప్పినట్టు విను’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఉన్న ఈ సాంగ్ సీపీ సజ్జనార్ మంగళవారం విడుదల చేశారు.

    ప్రస్తుతం ఈ పాటకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. సైబరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఎస్సై లాల్ మాధర్ ఈ పాటను రాశారు. హూషారైన సంగీతాన్ని అందించి ఈ పాటను యూట్యూబ్లో దీనిని విడుదల చేశారు. అలాగే సైబరాబాద్ పోలీస్ ట్వీటర్లో ఉంచి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ పాటను చూసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్వీటర్లో స్పందించారు. ఈ పాటను విడుదల చేసింది.. రీల్ హీరోకాదని.. రియల్ అంటూ సజ్జనార్ పై ఆర్జీవీ తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘దిశ’ సంఘటన విషయంలోనూ సజ్జనార్ రియల్ హీరో అంటూ ఆర్జీవీ గతంలో కొనియాడారు.

    ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చేస్తున్న సేవలను చూసి ‘పోలీసు బిడ్డ’గా గర్వపడుతున్నానని ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవకొండ పోలీసులు సేవలను కొనియాడుతూ సెల్యూట్ చేసిన సంగతి తెల్సిందే. పోలీసులు కోరుతున్నట్లు మనమంతా ఇళ్లకే పరిమితమై కరోనాపై జరిగే యుద్ధంలో గెలుద్దాం.. STAY HOME.. STAY SAFE.