Vennela Kishore: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా 2000 నోట్లు… రద్దయ్యాయి ఏం చేసుకుంటాడని ఆ హీరో ట్వీట్!

కోట్లలో నల్లధనం ఉన్న వాళ్లకు ఈ పరిణామంతో భారీ దెబ్బ తగిలినట్లే. మే 23 నుండి రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. కాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు తెప్పలుగా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయట.

Written By: Shiva, Updated On : May 20, 2023 7:47 pm

Vennela Kishore

Follow us on

Vennela Kishore: రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. మరోసారి డిమోనిటైజేషన్ కి పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తుంది. కొందరు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఇంట్లో ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. లేదా మార్చి నగదు పొందవచ్చు. గరిష్టంగా 10 రెండు వేల రూపాయల నోట్లను మాత్రమే ఒకసారికి మార్చుకోగలం. డిపాజిట్ అయితే ఎక్కువ మొత్తంలో నోట్లు మార్చవచ్చు.

కోట్లలో నల్లధనం ఉన్న వాళ్లకు ఈ పరిణామంతో భారీ దెబ్బ తగిలినట్లే. మే 23 నుండి రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. కాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు తెప్పలుగా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయట. నోట్ల కట్టల గుట్టను ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టిన మంచు విష్ణు.. వెన్నెల కిషోర్ ఇంట్లో ఇవి చూశానని ట్వీట్ చేశారు. ఇప్పుడివన్నీ వెన్నెల కిషోర్ ఏం చేసుకోబోతున్నాడని ఆయన కామెంట్స్ చేశారు.

మంచు విష్ణు సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతుంది. బిజీ ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ కోట్లలో సంపాదించాడని మంచు విష్ణు పరోక్షంగా చెప్పాడు. మరి ఈ ట్వీట్ పై వెన్నెల కిషోర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మంచు విష్ణు ట్వీట్ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు మనోజ్ కి బర్త్ డే విషెస్ చెప్పడం రాదు కానీ తొక్కలో కామెడీ చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నేడు మంచు మనోజ్ బర్త్ డే. విష్ణు ఆయన్ని విష్ చేయలేదు. అక్క మంచు లక్ష్మి మాత్రం ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. మోహన్ బాబు ముగ్గురు పిల్లల్లో మనోజ్, లక్ష్మి ఒకవేపు విష్ణు మరొకవైపు చేరారని తెలుస్తుంది. మనోజ్ పెళ్లిని లక్ష్మి దగ్గరుండి నిర్వహించింది. విష్ణు మాత్రం కన్నెత్తి చూడలేదు. నేడు బర్త్ డేకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు. మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయని తాజా పరిణామంతో రుజువైంది.

https://twitter.com/iVishnuManchu/status/1659868243002269697