Allu Arjun and Atlee : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) అతి పెద్ద ప్రయోగం చేయబోతున్నాడా..?, ఈ ప్రయోగం సక్సెస్ అయితే వండర్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే భారీ డిజాస్టర్ అవుతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్న భయం వెనుక ఎంత నిజం దాగుంది?, ఇంతకీ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో ఏమి చేయబోతున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీసెంట్ గానే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ త్వరలోనే మొదలు కాబోతుంది అంటూ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక అద్భుతమైన వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ని ఈ వీడియో షేక్ చేసి వదిలింది. టీజర్ విడుదలతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, ఆ రేంజ్ రెస్పాన్స్ ఈ వీడియో కి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడియన్స్ ని ఒక సరికొత్త ప్రపంచం లోకి ఈ వీడియో తీసుకెళ్లింది అనొచ్చు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర నెగటివ్ గా ఉంటుందని గత కొద్దిరోజులుగా మనం సోషల్ మీడియా లో వింటూనే ఉన్నాం. రీసెంట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, ఈ చిత్రం లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. మూడవ పాత్ర యానిమేటెడ్ గా ఉంటుందట. యానిమేటడ్ పాత్రనా?, అదేంటి?, అసలు ఏమి చెయ్యబోతున్నారు అంటూ అభిమానులకు కూడా క్లూ దొరకడం లేదు. అట్లీ అంటే ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్. ఇప్పటి వరకు ఆయన సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేస్తున్నాడంటే, ఏ హీరో అభిమానికి అయినా కాస్త టెన్షన్ ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్స్ గా ఇప్పటికే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ కూడా ఉందట, ఆ పాత్ర కోసం సమంత తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ జరగలేదు. ఇకపోతే అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి చాలా రోజులే అయ్యింది. సౌత్ ఇండియా లో మొట్టమొదటి సిక్స్ ప్యాక్ హీరో ఆయనే అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘దేశముదురు’, ‘వరుడు’, ‘బద్రీనాథ్’ చిత్రాల్లో ఆయన సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. ఇన్నాళ్లకు మరోసారి ఆయన అట్లీ చిత్రం కోసం సిక్స్ బాడీ ని పెంచబోతున్నాడు. అందుకు సంబంధించిన వర్కౌట్ సెషన్స్ ని కూడా మొదలు పెట్టేసాడు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?