Venky Atluri : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా వెంకీ అట్లూరి(Venky Atluri) ఉంటాడు. ఈయన 2010 వ సంవత్సరం లో ‘స్నేహ గీతం’ అనే చిత్రం ద్వారా డైలాగ్స్ రైటర్ గా, యాక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రెండు సినిమాలకు రైటర్ గా పని చేశాడు కానీ, ఆయన డైరెక్టర్ గా మారింది మాత్రం వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ చిత్రం తోనే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’, ఆ తర్వాత నితిన్ తో ‘రంగ్ దే’ చిత్రాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక అప్పటి నుండి ఆయన తెలుగు హీరోలతో సినిమాలు చేయడం మానేసాడు. ఇతర భాషలకు సంబంధించిన హీరోలను తెలుగు లోకి తీసుకొచ్చి సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు.
Also Read : ఎన్టీఆర్, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?
2023 వ సంవత్సరం లో తమిళ హీరో ధనుష్ తో మన తెలుగు తీసిన ‘సార్’ చిత్రం కానీ, అదే విధంగా గత ఏడాది దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనమంతా చూసాము. లక్కీ భాస్కర్ చిత్రం తో అయితే వెంకీ అట్లూరి అనే ఇమేజ్ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో సూర్య తో చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు సినిమానే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య ఈ చిత్రంతో కచ్చితంగా కం బ్యాక్ ఇస్తాడని ఇప్పటి నుండే బెట్టింగ్స్ వేసుకుంటున్నారు నెటిజెన్స్. అది వెంకీ అట్లూరి సాధించిన బ్రాండ్ ఇమేజ్ పవర్. అయితే ఎందుకు ప్రతీ సారీ వెంకీ అట్లూరి ఇతర భాషలకు చెందిన వారితోనే సినిమాలు చేస్తున్నాడు..?.
తెలుగు హీరోలతో చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్ల అతనికి మన తెలుగు హీరోలపై విరక్తి కలిగిందా?, లేకపోతే సహజంగానే తెలుగు హీరోలతో ఆయనకు సినిమాలు కుదరడం లేదా అనేది ఆయనే చెప్పాలి. బాగా గమనిస్తే వెంకీ అట్లూరి సినిమాలన్నీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కినవే. ప్రతీ బ్యానర్ కి ఆస్థాన దర్శకులు ఉన్నట్టుగానే, ఈ బ్యానర్ కి వెంకీ అట్లూరి అలా ఉన్నాడు అన్నమాట. వరుస ఫ్లాప్స్ తర్వాత ఒక సరికొత్త ట్రెండ్ ని టాలీవుడ్ కి పరిచయం చేసే క్రమం లో, ఇలా ఇతర భాషలకు సంబంధించిన టాప్ హీరోలతో తెలుగు సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడని, ఇదే ఫార్ములా ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సెంటిమెంట్ వెంకీ అట్లూరి కి ఇంకా ఎంత కాలం వర్కౌట్ అవుతుంది అనేది.