Venky Atluri
Venky Atluri: కొన్నేళ్లుగా సినిమాకు భాష, ప్రాంతం అనే బ్యారియర్స్ లేకుండా పోయాయి. సౌత్ సినిమాలు నార్త్ లో.. నార్త్ సినిమాలు సౌత్ లో ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలాగే తెలుగు దర్శకులతో ఇతర భాషల హీరోలు.. ఇతర భాషల దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేస్తున్నారు. సౌత్ డైరెక్టర్స్ లో బాలీవుడ్ స్టార్స్ అవకాశం ఇస్తున్నారు. కాగా దర్శకుడు వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడం విశేషం.
తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరికి మంచి విజయం దక్కింది. వరుణ్ తేజ్-రాశి ఖన్నా నటించిన తొలిప్రేమ యువతను ఆకట్టుకుంది. అయితే అనంతరం దర్శకత్వం వహించిన మిస్టర్ మజ్ను, రంగ్ దే ఆశించిన స్థాయిలో ఆడలేదు. సార్ మూవీతో మరలా ఫార్మ్ లోకి వచ్చాడు. ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు.
విద్యావ్యవస్థలోని లోపాలు ఎత్తిచూపుతూ తెరకెక్కిన సార్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు వెంకీ అట్లూరి. లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ హీరోగా నటించాడు. లక్కీ భాస్కర్ నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, క్రైమ్ కలగలిపి లక్కీ భాస్కర్ చిత్రాన్ని గొప్పగా చిత్రీకరించారు.
ధనుష్, దుల్కర్ సల్మాన్ లతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి నెక్స్ట్ హీరో సూర్య అని సమాచారం. ఆయనతో మూవీ దాదాపు ఖాయం అంటున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలో వెంకీ అట్లూరి వరుసగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. తన కథలకు టాలీవుడ్ స్టార్స్ సెట్ కారని భవిస్తూ ఉండవచ్చు. అలాగే టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు.
అలాగే కోలీవుడ్, మాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం వలన తెలుగుతో పాటు మరొక భాషలో కూడా మార్కెట్ ఏర్పడుతుంది. థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ జరుగుతుంది. ఈ సమీకరణాల రీత్యా కూడా వెంకీ అట్లూరి పరభాషా హీరోలతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాడేమో అనిపిస్తుంది. ఇక సూర్యకు హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. వెంకీ అట్లూరి మూవీతో సూర్య సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Web Title: Star director venky atluri is keeping telugu heroes aside is that the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com