Homeఎంటర్టైన్మెంట్Tollywood: చడీ చప్పుడు లేకుండా టాలీవుడ్ స్టార్ హీరో కూతురు పెళ్లి!

Tollywood: చడీ చప్పుడు లేకుండా టాలీవుడ్ స్టార్ హీరో కూతురు పెళ్లి!

Tollywood: స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజా మోగింది. ఆయన రెండో కుమార్తె హయవాహిని పెళ్లి మార్చి 15 శుక్రవారం జరగనుంది. ఈ వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో విజయవాడకు చెందిన డాక్టర్ తో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ వేడుక నిరాడంబరంగా చేశారు. చిరంజీవి, మహేష్ వంటి కొందరు స్టార్స్ మాత్రమే హాజరయ్యారు. అబ్బాయి వివరాలు కూడా పూర్తిగా బయటకు రాలేదు. నిశ్చితార్థం వేడుకలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

కాగా నేడు హయవాహిని వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. పెళ్లి కూడా నిరాడంబరంగా కానిస్తున్నట్లు సమాచారం. కేవలం సన్నిహితులు, బంధు మిత్రులు మాత్రమే హాజరుకానున్నారట. చిత్ర ప్రముఖులు హాజరుకాకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. వెంకటేష్-నీరజ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి.

పెద్దమ్మాయి ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ మనవడు అయిన వినాయక రెడ్డితో ఆశ్రిత వివాహం జరిగింది. వినాయక రెడ్డి- ఆశ్రిత విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆశ్రిత ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆశ్రితకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. వెంకటేష్ తన కుటుంబాన్ని పరిశ్రమకు దూరంగా ఉంచారు. భార్య, పిల్లల గురించి తెలిసింది చాలా తక్కువే.

ఇక వెంకటేష్ కొడుకు పేరు అర్జున్. ఇతడు టీనేజ్ లో ఉన్నట్లు సమాచారం. నెక్స్ట్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా వెంకీ చిత్రాల విషయానికి వస్తే… సైంధవ్ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. అయితే సైంధవ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సైంధవ్ తెరకెక్కింది. నెక్స్ట్ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version