మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కలయికలో హ్యాట్రిక్ మూవీగా రానున్న ‘క్రాక్’ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన పాత్రల పరిచయంతో పాటు రవితేజ క్యారెక్టర్ గురించి వెంకీ చెప్పినట్లు సమాచారం. రవితేజ పాత్రలోని వేరియేషన్స్ ను వెంకీ తన కామెడీ టైమింగ్ తో గోదావరి యాసలో ఫన్నీ వేలో చెప్పారట. ఇక ఈ వాయిస్ ఓవర్ చాల బాగా వచ్చిందని.. సినిమా స్టార్టింగ్ తో పాటు ఎండింగ్ లో కూడా వెంకీ వాయిసే ఉంటుందని టాక్.
Also Read: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడి మృతి
మొత్తానికి వెంకీ వల్లే సినిమాలోని మెయిన్ కంటెంట్ హైలైట్ అవుతుందట. మరి సంక్రాంతికి రాబోతున్న ఈ క్రాక్ లో వెంకీ ఎలాంటి మాటలు పలికాడో చూడాలి. జనవరి 1 సందర్భంగా శుక్రవారం.. క్రాక్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇక రవితేజ సరసన మెయిన్ హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే, వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెది సినిమాలో రవితేజ మొదటి భార్య పాత్ర అట.
Also Read: మా పిల్లల్ని ఆకతాయిలుగా పెంచం – విరుష్క
కాగా కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవడంతో మొదలైన వైర్యం తన భర్త రెండో భార్యను చంపే వరకూ వెళ్తుందని తెలుస్తోంది. ఇక రెండో భార్య పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో రవితేజ ఇద్దరి భార్యల భర్తగా నటించనున్నాడు. బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ – గోపీచంద్ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో చిత్రం ఇది. ఈ హిట్ కాంబినేషన్ క్రాక్ తో మళ్లీ రిపీట్ కాబోతోంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్