Venkatesh Trivikram movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Truvikram Srinivas)…కెరియర్ స్టార్టింగ్ లో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన దర్శకుడి గా మారి చేసిన సినిమాలు సైతం అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులు క్రితం వరకు అతను అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న సందర్భంలో ఇప్పుడు త్రివిక్రమ్ ఆ సినిమా పూర్తయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఆ సినిమా పూర్తవ్వడానికి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి అప్పటివరకు తను అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం లేదు అంటూ ఆయన వెంకటేష్ ను హీరోగా పెట్టి ఒక సినిమాని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన ఈ సినిమా చేస్తున్నాడు అంటు కొన్ని వార్తలు ఐతే వస్తున్నాయి.
Also Read : రామ్ చరణ్ దెబ్బ కి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందా..?
మరి ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ త్రివిక్రమ్ ఈ సినిమా మీద స్పందిస్తాడా? లేద అనేది తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ ఇంతకు ముందు చేసిన ‘గుంటూరు కారం’ సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…
దానివల్లే ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో స్టార్ హీరోలు ఎవరు ఖాళీగా లేరనే చెప్పాలి. కానీ అంతకుముందే అల్లు అర్జున్ తో కమిట్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో వెంకటేష్ తో సినిమా చేయడానికి సిద్ధబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ విషయాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు తన సన్నిహితుల దగ్గర తరచుగా చెబుతున్నారట. మరి ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఉంది అనేది తెలీదు కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త లైతే వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ సినిమా వస్తే మాత్రం సూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…