Ram Charan : మెగా పవర్ స్టార్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan)…మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొడుకు అయినప్పటికి ఆయనకి ఏ మాత్రం గర్వం లేకుండా తోటి ఆర్టిస్టులను గౌరవిస్తూ వాళ్లతో కలిసి నటిస్తూ ఆయనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కెరియర్ మొదట్లో ఆయనకు యాక్టింగ్ సరిగ్గా రాదు అంటూ కొంతమంది విమర్శించినప్పటికి తన నటనతో అంచలంచెలుగా ఎదుగుతూ తనను విమర్శించిన వాళ్ళ చేతే శభాష్ అనిపించుకునేలా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సుకుమార్ (Sukumar) తో చేసిన రంగస్థలం (Rangasthalam) సినిమాలో తన నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఆయన నటించిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలైనప్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పాలి. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికి ఆ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబ (Buchhi Babu) డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : గుణశేఖర్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఎలా మిస్సయింది..?
గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డీలా పడిపోయిన ఆయన మరోసారి పెద్ది సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను సైతం బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది.
పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి అత్యధికంగా కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… మరి ఈ సినిమా రికార్డును సైతం బ్రేక్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఎవరితో పోటీ పెట్టుకోడు. కానీ సినిమాలపరంగా మాత్రం తను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని అతని కోరిక…
అందువల్లే తను మంచి సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తాడు. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన కంటూ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు రాబోతుంది. అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…